సామ్ – చైతూ కొట్టుకుంటున్నారు!

Telugu Movie News

ఆర్టిస్టుల‌కు కొన్ని సంద‌ర్భాల్లో చాలా మంచి పేస్‌ ఉంటుంది. చాలా చాలా మంచి పాత్ర‌లు ప‌డుతుంటాయి. స‌మంత ఇప్పుడు ఆ పేస్‌లోనే ఉంది. త‌న‌కు చాలా మంచి ప్రాజెక్టులు కుదురుతున్నాయి అని ఆ మ‌ధ్య చైతూ అన్నారు. పైకి అలా అంటున్నారే గానీ లోప‌ల్లోప‌ల సామ్ – చైతూ ఎక్కువ‌గా ఆలోచిస్తున్నార‌ని టాక్‌. నాగ‌చైత‌న్య న‌టించిన శైల‌జారెడ్డి అల్లుడు, స‌మంత న‌టించిన యు ట‌ర్న్ ఒకే రోజున విడుద‌ల‌య్యాయి. రెండు సినిమాలూ ఎప్పుడొచ్చాయో, ఎప్పుడెళ్లాయో తెలియ‌లేదు. అలా వచ్చి వెళ్లాయంతే. ఈ విష‌యాన్ని చైతూ కూడా అంగీక‌రించారు. త‌న‌కు తొలి రోజు ఓపెనింగ్స్ ప‌రంగా శైల‌జారెడ్డి అల్లుడు ఆనందాన్ని క‌లిగించినా, త‌ర్వాత ఆ ఆనందం నిల‌వ‌లేద‌ని, డిస‌ప్పాయింట్‌మెంట్ క‌లిగింద‌ని చైతూ చెప్పారు. ఆయ‌న న‌టించిన తాజా సినిమా స‌వ్య‌సాచి కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తాప‌డింది. విడుద‌లైన తొలి షోకే సినిమాలో స‌త్తా లేద‌ని తేలింది. ఇప్ప‌టిదాకా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ తో హ్యాట్రిక్ సంస్థ‌గా పేరు తెచ్చుకున్న మైత్రీ మూవీస్‌కి కూడా తొలి ఫ్లాప్ ప‌డ్డ‌ట్ట‌యింది. సో ఇప్పుడు చైతూకి హిట్లు లేవు. అటు స‌మంత‌, ఇటు చైతూ క‌లిసి ప్ర‌తి రోజూ సెట్లో కొట్టుకునే కేర‌క్ట‌ర్లో న‌టిస్తున్నారు. రియ‌ల్ లైఫ్‌లో హ్యాపీగా ఉన్న ఈ జంట ప్ర‌స్తుతం సెట్లో కొట్టుకుంటోంది. మ‌నంలోనూ వీళ్లిద్ద‌రూ కొట్టుకున్నారు. ఆ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్‌. మ‌రి శివ నిర్వాణ నిర్మించే ఈ సినిమా ఎలాంటి రిజ‌ల్ట్ ఇస్తుందో చూడాలి మ‌రి.

Telugu Movie News, Naga chitanya latest News, telugu Latest Movie, Telugu news Update, Update New Move, Naga chitanya update news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *