వెలుగు చీక‌టి

Telugu News
నోట్లు ర‌ద్ద‌యి నేటితో రెండేళ్లు
డీమానిటైజేష‌న్ ఫ‌లితాలు మామూలుగా లేవుగా
పెద్దోళ్లంతా ఇప్ప‌టికీ సేఫ్ వ‌చ్చిందా బ్లాక్ మ‌నీ వెన‌క్కు

ఈ దీపావ‌ళి త‌రువాత మోడీ హాయిగా నిద్దుర‌పోతార‌ని అనుకోలేం. ఆయ‌నే కాదు ఆయ‌న స‌హ‌చ‌రులు కూడా అంత‌గా హ్యాపీగా ఉన్నార‌ని చెప్ప‌లేం. మోడీ- షా ద్వ‌యానికి ఎదురీత త‌ప్ప‌ద‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. దేశ‌వ్యాప్తంగా కొన్ని చ‌ర్య‌లు ఫ‌లితాలు ఇవ్వ‌క‌పోగా వ్య‌తిరేక‌త‌ను కూడ‌దీసుకునేలా చేశాయి. అమిత్ షా లాంటి వారి కార్పొరేట్ రాజ‌కీయాలు ఇంకా మేలిమి ప్ర‌యోజ‌నాల‌ను బీజేపీకి ఇవ్వ‌టం లేద‌నే చెప్పాలి.

అంతా కుదేలయిన రోజు
రాత్రికి రాత్రి నిర్ణ‌యం వెలువ‌రించిన రోజు
న‌వంబ‌ర్ ఎనిమిది 2016 ..
ఈదేశాన ఆర్థిక ప్ర‌గ‌తికి విఘాతం క‌ల్పించిన రోజు
సామాన్యుడ్ని అష్ట‌క‌ష్టాల పాల్జేసిన రోజు

అప్ప‌టి నుంచి ఏవేవో ష‌ర‌తులు మోడీ పెడుతూనే ఉన్నారు. ఉద్దేశ పూర్వ‌క ఎగ‌వేత దారులు దేశం దాటి పోతున్నా చేష్ట‌లుడిగి చూస్తున్న మోడీ
నోట్ల ర‌ద్దుతో ఏం సాధించారో అన్న‌ది ఇప్ప‌టికీ అంతుతేల‌ని ప్ర‌శ్న‌. ఆయ‌న భావించిన విధంగా న‌ల్ల‌ధ‌నం వెన‌క్కు రాలేదు. ఆయ‌న భావించిన విధంగా సంస్క‌ర‌ణ ఫ‌లితాలు ఏ పేద‌వాడికీ ప్ర‌యోజ‌నం చేకూర్చ‌లేదు. ఎప్ప‌టిలానే పెద్ద‌లంతా సేఫ్‌. కార్పొరేట్ శ‌క్తులంతా సేఫ్. మ‌నీ మాఫియా ను ఆపే శ‌క్తి మోడీకి లేద‌ని తేలిపోయింది. ఓ విధంగా ప్ర‌భుత్వాన్ని న‌డిపే శ‌క్తులే ఈ మాఫియాకు ప్రోత్సాహ‌కారులు అన్న నింద‌నూ ఎన్డీఏ పెద్ద‌లు మూట‌గ‌ట్టుకున్నారు.

దేశానికి ముందున్నందంతా మంచే అనుకోవ‌డం త‌ప్పు
ముందుచూపు లేని చ‌ర్య‌లే అందుకు నిద‌ర్శ‌నం
మోడీ బ‌డా బాబుల బాగోతం వెలుగులోకి తెస్తార‌ని ఎవ‌రు ఆశించినా అది త‌ప్పే
ఓ నిర్ణయాక శ‌క్తిగా ఇవాళ బీజేపీని న‌డిపిస్తున్న పెద్ద పెద్ద పారిశ్రామిక‌వేత్త‌లు
ధ‌నవంతులు సామాన్య ప్ర‌జానికానికి మేలు క‌లిగించే చ‌ర్య‌ల‌కు మ‌ద్ద‌తు ఇస్తార‌ని అనుకోలేం

మోడీ ఈ సారి ప్ర‌ధాని అవుతార‌ని వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కూత వేటు దూరంలో అయినా ఆయ‌న కూట‌మి గెలుపు ఉంటుందని, ఓ ప‌ది నుంచి
20 సీట్లు మెజార్టీకి త‌క్కువ అయినా ఆయ‌నే వ‌చ్చేస్తార‌ని ప‌గ్గాలు అందుకుంటార‌ని బీజేపీ వ‌ర్గాలు ఆశిస్తున్నాయి.అధికారం ద‌క్కించుకోవాల‌న్న క్ర‌మంలో ఇలాంటి ఆశ‌లు కాంగ్రెస్ లో కూడా ఉన్నాయి.ఐతే ఆ ఆశ‌లు ఫ‌లిస్తాయో మోడీ ఆశ‌లే నెర‌వేర‌తాయో అన్న‌ది తేలాలంటే కొంత కాలం
ఆగాల్సిందే. గ్రామీణ ప్ర‌జానికం ఈ రోజుకూ పెద్ద నోట్ల ర‌ద్దు వ‌ల్ల త‌లెత్తిన స‌మ‌స్య‌లు చ‌వి చూస్తూనే ఉన్నార‌న్న‌ది కాద‌న‌లేని వాస్త‌వం.నోట్ల ర‌ద్దు
తరువాత విత్ డ్రా ప్రాసెస్ పై విధించిన ఆంక్ష‌లు పెద్ద త‌ల‌నొప్పిగా మారాయి. అదేవిధంగా ఉద్దేశ పూర్వ‌క ఎగ‌వేత దారులు దేశం దాటి మోడీకి
స‌వాళ్లు జారీ చేస్తుంటే చేష్ట‌లుడిగిపోయిన సంద‌ర్భాలే అనేకానేకం.

నోట్ల ర‌ద్దు త‌రువాత బ్యాకింగ్ వ్య‌వ‌స్థ‌లో తీసుకువ‌చ్చిన మార్పులూ చేర్పులూ ఏవీ ఏమంత గొప్ప‌వి కావ‌న్న‌ది ఒప్పుకోద‌గ్గ విష‌యం. పెద్ద నోట్ల
రద్దు త‌రువాత బ‌డుగు వ్యాపారులు అంతా చితికిపోయారు. బ‌డా వ్యాపారుల సామ్రాజ్యాల‌కు పెద్ద న‌ష్టం వ‌చ్చిన దాఖ‌లాలు లేవు. అనేకానేక రీతుల్లో నోట్ల మార్పిడి ఓ దుశ్చ‌ర్య‌గా మారిపోయింది.అయిన‌ప్ప‌టికీ దీన్నొక గొప్ప ఆర్థిక సంస్క‌ర‌ణ‌గా క‌మ‌ల‌నాథులు చెప్ప‌డ‌మే ఓ వింత. ఓ అనాలోచిత చ‌ర్య కార‌ణంగా దేశంలో సంక్షోభ వాతావ‌ర‌ణానికి ఎంద‌రెంద‌రో చావుల‌కు కార‌ణం అయిన ప్ర‌భుత్వ పెద్ద‌లు ఇప్ప‌టికైనా దీన్నొక సాహ‌సోపేత నిర్ణ‌యంగా అభివ‌ర్ణించ‌డం మానుకుంటే మేలు.

Telugu News , Modi News,  Big Currency Notes news, Election news, BJP Latest News , Telugu Update News, Telugu Breaking News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *