అక్టోబ‌రు 21 నుంచి 27 వార‌ఫ‌లాలు

Telugu Panchangam

మేషరాశి : ఈవారం బంధువులతో సమయాన్ని సరదాగా గడుపుతారు, మీ ఆలోచనలను వారితో పంచుకొనే అవకాశం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో ముఖ్యమైన ఆలోచనలు చేస్తారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. కుటుంబపరమైన విషయాల్లో మీవైనా నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తారు. రుణపరమైన విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండుట, మీ శక్తిని గుర్తించి ముందుకు వెళ్ళండి. పెద్దలతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. నూతన పరిచయాలకు అవకాశం ఉంది, వారితో సమయం గడుపుతారు. చర్చల్లో పాల్గొంటారు.

వృషభరాశి : ఈవారం ఉద్యోగంలో బాగుంటుంది, అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. గతంలో చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. జీవితభాగస్వామితో విభేదాలు ఏర్పడే ఆస్కారం ఉంది, జాగ్రత్త. సర్దుబాటు విధానం మంచిది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. పెద్దలతో చర్చల్లో పాల్గొంటారు, వారై సూచనల మేర ముందుకు వెళ్లడం మంచిది. నూతన అవకాశాలు పొందుతారు.

 

మిథునరాశి:  ఈవారం అధిక సమయం చర్చాపరమైన విషయాలకు ఇస్తారు. తలపెట్టిన పనుల విషయంలో స్పష్టత లేకపోతే ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగ చేతికి అందుతుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. మీ మాటతీరు విషయంలో స్పష్టత లేకపోతే నూతన సమస్యలు వస్తాయి. వాహనాల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరమైన విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యక్రమాలు జరుగుటకు ఆస్కారం ఉంది.

 

కర్కాటకరాశి : ఈవారం జీవితభాగస్వామితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. వ్యాపార పరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చును లేదా ఆత్మీయుల అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తాయి. మిత్రులతో కలిసి వినోదాలలో పాల్గొంటారు. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేసే ప్రయత్నం చేయుట మంచిది. చర్చలకు దూరంగా ఉండుట మేలు.

 

సింహరాశి : ఈవారం పెద్దలను కలుస్తారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడుటకు ఆస్కారం ఉంది. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి ఆశించిన విధంగా సహకారం పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. సంతానం విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. విదేశీప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. సోదరుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విలువయిన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది.

 

కన్యారాశి : ఈవారం రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. కుటుంబంలో పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానపరమైన విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ మాటతీరు కొంత మందికి నచ్చక పోవచ్చును, మీ విధానాలకు మీరు కట్టుబడి ఉండుట సూచన. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం విషయంలో తగిన శ్రద్ద తీసుకోండి.

 

తులారాశి: ఈవారం పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. జీవిత బాగా స్వామితో విభేదాలు మరింతగా పెరుగుటకు ఆస్కారం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబపరమైన విషయాల్లో ఒకలాంటి ఇబ్బందిని పొందుతారు. విదేశి ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. చిన్న చిన్న విషయాల్లో మరింతగా జాగ్రత్తగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. మీ మాటతీరు వలన నస్టపోతారు. చర్చలకు దూరంగా ఉండుట అవసరం.

 

వృశ్చికరాశి : ఈవారం పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి. తలపెట్టిన పనుల విషయంలో స్పష్టత అవసరం. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోండి. బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సోదరులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. ముందుగా గతంలో చేపట్టిన పనులను పూర్తిచేయుట సూచన. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరమైన విషయాల్లో సర్దుబాటు విధానం మంచిది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం . మంచి ఫలితాలు పొందుతారు.

 

ధనస్సురాశి: ఈవారం ఈవారం ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. సర్దుబాటు విధానం మంచిది. చేపట్టిన పనులకు సమాధాన చెప్పవలసి వస్తుంది. చిన్న చిన్న విషయాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. వారినుండి ఊహించని విధంగా సహకారం పొందుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. రుణపరమైన విషయాల్లో ఏమాత్రం అశ్రద్దగా ఉన్న నష్టపోయే అవకాశం ఉంది, కావున జాగరత్త అవసరం.

 

మకరరాశి : ఈవారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు, అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. దూరప్రదేశంలో ఉన్న మిత్రుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. చర్చాపరమైన విషయాలకు దూరనంగా ఉండుట సూచన. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆత్మీయుల నుండి ఆశించిన మేర సహకారం పొందుతారు, నూతన అవకాశాలు లభిస్తాయి. జీవితభాగస్వామితో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది, అవతలి వారై సూచనలు వినడం మంచిది.

 

కుంభరాశి : ఈవారం మిత్రులతో సమయం గడుపుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. కుటుంబపరమైన విషయాల్లో తలదూర్చక పోవడం మంచిది. వ్యాపార పరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు మేలుచేస్తాయి. వాహనాల వలన ఇబ్బందులు తప్పకపోవచ్చును. రుణపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తలు అవసరం.

 

మీనరాశి : ఈవారం ఆరంభంలో నిదానంగా వ్యవహరించుట సూచన. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. మీకు రావాల్సిన అవకాశాలు సమయానికి అందుతాయి. కొన్ని కొన్ని విషయాల్లో ఒకింత ఒత్తిడికి లోనయ్యే ఆస్కారం ఉంది. సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. బంధువులతో సమయం సరదాగా గడుపుతారు. విదేశీప్రయాణ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు. విశ్రాంతి అవసరం.
Telugu Panchangam

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *