25-11-2018 నుండి 01-12-2018 వరకు వారఫలాలు

Telugu Panchangam

మేషరాశి :ఈవారం మొత్తం మీద చేపట్టు పనుల విషయంలో స్పష్టత కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచితం. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట మంచిది. అధికారులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. భాగస్వమీతో విభేదాలు పెరుగుటకు ఆస్కారం ఉంది. నూతన ఉద్యోగప్రయత్నాలు పెద్దగా కలిసి రాకపోవచ్చును. విదేశాల్లో ఉన్నవారికి స్వదేశంలో ఉన్న మిత్రులతో చర్చలు జరుగుటకు ఆస్కారం ఉంది. నూతన అవకాశాలు లభిస్తాయి. స్పష్టత వలన మేలుజరుగుతుంది. 
 

వృషభరాశి :ఈవారం మొత్తం మీద ఆరంభంలో ఇబ్బందులు తప్పక పోవచ్చును, ఆరోగ్యపరమైన  సమస్యలు తప్పక పోవచ్చును. ముందుగా గతంలో చేపట్టిన పనులను పూర్తిచేయుట సూచన. వ్యాపార పరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. సోదరుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకొనే ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కోల్పోయే ఆస్కారం ఉంది. పెద్దలను కలుస్తారు, వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. చర్చలకు సాధ్యమైనంత దూరంగా ఉండుట సూచన. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచితం. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన మేర సహకారం పొందుతారు. 


మిథునరాశి:ఈవారం మొత్తం మీద కుటుంబంలో ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు ఆస్కారం ఉంది. జీవితభాగస్వామితో కలిసి ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వస్తారు. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుటకు ఆస్కారం ఉంది. చర్చాపరమైన విషయాలకు సాధ్యమైనంత మేర దూరంగా ఉండుట సూచన. కోపాన్ని తగ్గించుకోవడం వలన మేలుజరుగుతుంది.విలువైన వస్తువులను కొనుగోలు చేసే విషయంలో స్పష్టత ఉండుట మంచిది. స్త్రీ పరమైన విషయాల్లో అశ్రద్దగా ఉంటె ఇబబందులు తప్పక పోవచ్చును. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి, పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది.
 
కర్కాటకరాశి :ఈవారం మొత్తం మీద సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట మంచిది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యమైన విషయంలో ఈమాత్రం ఏమరుపాటు పనికిరాదు. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. చిన్న చిన్న విషయాల్లో భాగస్వామి నుండి పూర్తిగా సహకారం లబీస్తుంది. విలువైన వస్తువులను నష్టపోయే ఆస్కారం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. బంధువులను కలుస్తారు, వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. కుటుంబంలో కీలకమైన ఆలోచనలు చేయుటకు అవకాశం కలదు.
 
సింహరాశి :ఈవారం మొత్తం మీద పెద్దలను కలుస్తారు, వారితో మీ లోచనలు పంచుకుంటారు. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. గతంలో చేపట్టిన పనుల వలన నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. విలువైన వసువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. మిత్రుల సహకారం వలన పనులను పూర్తచేయుటకు ఆస్కారం ఉంది. రావాల్సన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతుంది. చర్చాప్రమైన విషయాలకు దూరాంగా ఉండుట సూచన. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. తండ్రి తరుపు బంధువులతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సూచితం. 


కన్యారాశి :ఈవారం మొత్తం మీద ఆత్మీయులను కలుస్తారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. జీవితభాగస్వామితో కలిసి ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచితమ్. గతంలో మొదలు పెట్టిన పనులను ముందుగా పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిది. బంధువులను కలుస్తారు, వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది, కాస్త ఓపికగా ఉండుట సూచన. నలుగురిని కలుపుకొని వెళ్ళండి. 
 
తులారాశి:ఈవారం మొత్తం మీద మానసికపరమైన ఇబ్బందులు తప్పక పోవచ్చును , కాస్త దైర్యంగా ఉండుట సూచన. కుటుంబంలో పెద్దలతో కలిసి సమాలోచనలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో రావాల్సిన ధనం సమయానికి చేతికి అందక పోవచ్చును. మీ మాటతీరు చాలామందికి నచ్చకపోవచ్చును, సర్దుబాటు విధానం మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. మిత్రులతో కలిసి పనిచేసే సమయాల్లో వారై అభిప్రయాలను పరిగణలోకి తీసుకోండి. ఆరోగ్యపరమైన విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు, అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుటకు ఆస్కారం ఉంది. 
 
వృశ్చికరాశి :ఈవారం మొత్తం మీద నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి , అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. బంధువులను కలుస్తారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సంతాన పరమైన విషయాల్లో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంలో పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మిత్రులతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. చిన్న చిన్న విషయాలను సైతం పరిగణలోకి తీసుకోవడం మంచిది. వ్యాపార పరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు.
 
ధనస్సురాశి:ఈవారం మొత్తం మీద ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకొనే ముందు కొంత ఇబ్బందికి గురిఅయ్యే అవకాశం ఉంది. అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఆత్మీయులను కలుసుకునే ఆస్కారం ఉంది, గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. విదేశీప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. స్త్రీ పరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచితం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. 


మకరరాశి :ఈవారం మొత్తం మీద బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది, వారితో కలిసి నూతన ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. సాధ్యమైనంతమేర అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. చిన్న చిన్న విషయాలను సైతం అశ్రద్ధ చేయకండి. కుటుంబపరమైన విషయాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది.  


కుంభరాశి :ఈవారం మొత్తం మీద మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. పెద్దలతో మీకున్న పరిచయం బలపడుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. ఎవరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి, సాధ్యమైనంత మేర వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండుట సూచన. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందకపోవచ్చును. చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది.   


మీనరాశి :ఈవారం మొత్తం మీద ఆరంభంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పక పోవచ్చును, ప్రణాళిక కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. నూతన పరిచయాలకు అవక్షం ఉంది. వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది . అనుకోకుండా చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. గతంలో చేపట్టిన పనుల వలన నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. బంధువులను కలుస్తారు. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది , తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. 
Telugu Panchangam

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *