మంత్రి తలసానికి ఓటమి తప్పేలా లేదా

thalasani srinivas yadav news

ఒకప్పుడు సమైక్యవాదిగా చెప్పుకున్న మంత్రి తలసాని టిఆర్‌ఎస్‌లో చేరడం ఏమిటి..? మంత్రి పదవి తెచ్చుకోవడం ఏమిటి..? తనదైన శైలిలో నగరంలో అలజడి సృష్టించిన ‘తలసాని’ ప్రస్తుతం ఏకాకిగా మిగిలిపోయారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలో తలసానిపై టిడిపి అభ్యర్థి కానీ..కాంగ్రెస్‌ అభ్యర్థికానీ పోటీ చేసినా..ఆయన ఘోరంగా ఓడిపోవడం ఖాయమనే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

  హైదరాబాద్‌ నగర పార్టీ నాయకుల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు ‘చంద్రబాబు’ ఇచ్చిన గౌరవాన్ని ప్రాధాన్యతను గుర్తించకుండా మంత్రి పదవి కోసం టిఆర్‌ఎస్‌లో చేరి, వ్యక్తిగత స్వార్థం చూసుకోవడమే ప్రస్తుతం ఆయన పాలిట శాపంగా మారబోతోంది. ఏయే ఓటర్ల మద్దతుతో 2014లో ఆయన విజయం సాధించారో…ప్రస్తుతం ఆయా ఓటర్లల్లో మెజార్టీ ఓటర్లల్లో మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌కు పూర్తిగా వ్యతిరేకంగా మారారు. ఈ నియోజకవర్గం నుండి తాను పోటీ చేస్తానని..మీ ఆశీస్సులతో పాటు మద్దతు కూడా ఇవ్వాలని మాజీ మంత్రి మర్రి శశిధర్‌ రెడ్డి స్వయంగా కలసి కోరడం జరిగింది. ఇదే విషయాన్ని ఆయన తన అనుచరులతో చెబుతూ..సనత్‌నగర్‌ సీటు తనకుదక్కడం ఖాయం..చంద్రబాబు కూడా అంగీకరించారు.

స్థానికంగా ఓటర్ల జాబితాలో ఎవరెవరి ఓట్లు ఉన్నాయో పరిశీలించండి..అని చెప్పడంతో వారు ఆ పనిలో మునిగిపోయారు. నిన్నా మొన్నటి వరకు తన మెజార్టీ ఇంత అని ధీమా వ్యక్తం చేసిన ‘తలసాని’ భయాందోళనలో కనిపిస్తున్నారట. ‘చంద్రబాబు’ ఆశీస్సులతో రాజకీయంగా, ఆర్థికపరంగా, ఆయన బంధుమిత్రులు ఖంగుతినే స్థితికి ఎదిగిన తలసానితో బంధువుత్వం కలుపుకున్నారు టిటిడి ఛైర్మన్‌ సుధాకర్‌యాదవ్‌. అదే బంధుత్వం ఆర్థిక మంత్రి ‘యనమల రామకృష్ణుడు’ ఇంతకు ముందు కలుపుకోవడంతో వారంతా ఒక మాటపై ఉంటారని అందరికీ తెలుసు. తాజాగా తలసానిని ఎలా రక్షించాలనే విధంగా మంత్రి యనమల, సుధాకర్‌లు ఆలోచిస్తున్నారట. ఎవరు ఎన్ని ఆలోచనలు చేసినా..చివరకు డమ్మీ అభ్యర్థిని ‘తలసాని’పై పెట్టినా ఆయన ఓడిపోవడం ఖాయమని స్వంత పార్టీ నేతలే చెబుతున్నారు.

thalasani srinivas yadav news,minister thalasani srinivas yadav latest news, thalasani srinivas yadav will loose in newt elections

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *