ఉత్తర తెలంగాణలో నేతల తలరాత మార్చే గల్ఫ్ ఓటుబ్యాంకు

The Gulf Vote Bank

తెలంగాణలో రాజకీయ పార్టీల్ని ఇప్పుడు గల్ఫ్ గుబులు పట్టుకుంది. గల్ఫ్ ఓటర్లు కీలకం కావటంతో వారిని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు ప్రధాన పార్టీల నాయకులు. ఉత్తర తెలంగాణలో దాదాపు 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల తలరాతను మార్చేందుకు గల్ఫ్ కుటుంబాలు సిద్జంగా ఉన్నాయి. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. తెలంగాణకు చెందిన సుమారు 10 లక్షలమంది కార్మికులు గల్ఫ్‌లో పనిచేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో ఉమ్మడి నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలతో పాటు మెదక్‌లో కొన్ని ప్రాంతాలకు చెందిన 10 లక్షల మంది కార్మికులు గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్నారు.దీంతో ఆయా వారి కుటుంబ సభ్యుల ఓట్లు తాజా ఎన్నికల్లో కీలకం కాబోతున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రస్తుతం గల్ఫ్ ఓటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఒక గల్ఫ్‌ కార్మికుడి కుటుంబానికి సగటున 4 ఓట్ల చొప్పున.. 40 లక్షల ఓట్లు ఉత్తర తెలంగాణలో ఉన్నట్లు పార్టీల అంచనా. అయితే గల్ఫ్‌లో పనిచేస్తున్న కార్మికులు.. తెలంగాణకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి లేదు. కానీ, వారి కుటుంబాల ఓట్లు మాత్రం కీలకం కాబోతున్నాయి. గతంలో గల్ఫ్‌ దేశాలకు వలసపోయి, తిరిగొచ్చిన బాధితులు మరో 20 లక్షల మంది ఉన్నా రు. మొత్తం 60 లక్షల మందితో గల్ఫ్‌ ఓటు బ్యాంకు తెలంగాణలో పటిష్ఠంగా ఉంది.
ఒక నియోజకవర్గంలో కనిష్ఠంగా 15 వేల మంది ఓటర్లు ఉంటే.. గరిష్ఠంగా 30 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో గల్ఫ్ కార్మికుల కోసం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. గల్ఫ్‌లో చనిపోయిన కార్మికుడి కుటుంబానికి రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని తెలిపింది. రూ. 500 కోట్లతో గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ నిధి, జైళ్లలో మగ్గుతున్న కార్మికులకు ఉచిత న్యాయసాయం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందు పరిచింది. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని టీఆర్‌ఎస్‌ హామీ ఇస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా గల్ఫ్ కార్మికులు,కుటుంబాల కోసం హామీలు కల్పించింది. ఇప్పటికే భరోసా యాత్ర చేపట్టిన ఆ పార్టీ.. దుబాయికి వెళ్లి అక్కడి కార్మికులతో సమావేశం కావాలని నిర్ణయించింది పీసీసీ.మరి రానున్న ఎన్నికల్లో గల్ఫ్ కుటుంబాలు ఏ పార్టీని కరుణిస్తాయో… వేచి చూడాల్సిందే.

The Gulf Vote Bank , North Telangana , North Telangana People ,  Latest News for North Telangana People , Telangana Latest News.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *