డీజీపీ వచ్చి వివరణ ఇవ్వాల్సిందే

Those who Knows DTP Give them

రేవంత్ అరెస్టు వ్యవహారంలో హైకోర్టు స్పష్టీకరణ

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారంలో హైకోర్టు మరోసారి పోలీసులపై మండిపడింది. అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్లి మరీ ఆయన్ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. దీనిపై డీజీపీ నేరుగా వచ్చి సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో సీఎం కేసీఆర్ సభ అడ్డుకోవాలని రేవంత్ పిలుపునిచ్చన నేపథ్యంలో ఆయన్ను మంగళవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.దీనిపై కాంగ్రెస్‌ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి అక్రమాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినందుకే పోలీసులు చట్టవిరుద్ధంగా రేవంత్‌రెడ్డిని నిర్బంధించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Buy the Latest smart Phone Cheaper Price 

అప్పుడు ఈ పిటిషన్ పై విచారణ జరిపి, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసిన హైకోర్టు.. తాజాగా బుధవారం ఈ పిటిషన్ పై మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్ సమాచారం మేరకే రేవంత్ ను అరెస్టు చేశామని ఏజీ కోర్టుకు తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఇంటెలిజెన్స్‌ నివేదిక ఆధారంగా అర్ధరాత్రి అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. దీనిపై డీజీపీ నేరుగా వచ్చి సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఎన్నికల విధుల్లో డీజీపీ నిమగ్నమై ఉన్నారని ఏజీ సమాధానం చెప్పినప్పటికీ సంతృప్తి చెందని ధర్మాసనం.. డీజీపీ వచ్చి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ఆయన నేరుగా కోర్టుకు సమాధానం ఇవ్వాలంటూ విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణను వాయిదా వేసింది.

Those who Knows DTP Give them

 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *