తిత్లీ నష్టం ౩ వేల కోట్లయితే కేంద్ర సాయం 229 కోట్లేనా

Titli loss is Rs 3,000 crores

కేంద్రం ఏపీ విషయంలో ఎప్పుడూ రాజకీయమే చేస్తుంది. కష్టమొచ్చింది ఆదుకోండి అని అడిగితే సాయం చేసే విషయంలో కూడా కక్ష పూరిత ధోరణి అవలంబిస్తుంది. మోడీ సర్కార్ ఏపీపై ఏ స్థాయిలో వివక్ష చూపుతోందో తిత్లీ తుఫాను విషయంలో కేంద్రం అందించిన సాయం చెప్తుంది. ఇప్పటికే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధుల్ని ఆపేసి మొండి చేయి చూపించిన కేంద్రం చివరికి కష్టాల్లో ఉన్న తిత్లీ తుఫాన్ బాధితుల విషయంలోనూ తన అక్కసును వెళ్లగక్కింది. తుఫాను బాధితులకు తక్షణ సహాయం కోసం 1200 కోట్లు విడుదలచేయాలని చాలా రోజుల క్రితం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాస్తే కేంద్రం పంపిన సాయం చూస్తే షాక్ కు గురవ్వాల్సిందే .
తిత్లీ తుఫాను శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పెను విషాదాన్ని నింపింది. లక్షల మందిని నిరాశ్రయులను చేసింది. వేల కోట్ల ఆస్తి నష్టం , పంట నష్టం జరిగింది. ఇప్పటికీ వందల గ్రామాలు తిత్లీ మిగిల్చిన బాధ నుండి కోలుకోలేదు. ఎవరు ఎంత సాయం చేసినా ఆ కష్టం తీరేలా లేదు. మూడు వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది అని అంచనా వేసిన ప్రభుత్వం కేంద్రాన్ని సాయం అర్ధిస్తూ లేఖ రాసింది. తక్షణ సాయం క్రింద 1200 కోట్లు కావాలంటే కేంద్రం మాత్రం చూద్దాంలే అన్నటు వ్యవహరించి కంటి తుడుపు చర్యగా నిన్న 229 కోట్ల నిధులు ఇస్తున్నామని, బాధితులకు సహాయం చేయండని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ నిధుల్ని చూసి రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఖర్చు పెట్టాలో తెలియక, కేంద్రం చేసిన సహాయం చూసి తలలు పట్టుకుంది. అంత నష్టం జరిగితే కేంద్రం 229 కోట్లు ఇవ్వడం మరీ హాస్యాస్పందంగా ఉంది. కొండంత నష్టానికి గోరంత సాయం చేసిన కేంద్ర సర్కార్ అందించిన సాయం బాదితులను ఆదుకోటానికి ఏ మాత్రం సరిపోదు.
కేంద్రం ఏపీలో తుఫాను బాదితుల కోసం కూడా మానవతా దృక్పధంతో స్పందించకపోవటం పట్ల అధికార పార్టీ నేకాకుండా అన్ని ఇతర పార్టీలు కూడ అసహనం వ్యక్తం చేస్తున్నాయి.. గతంలో కూడ విశాఖలో హుద్‌హుద్‌ తుఫాను నష్టానికి పరిహారంగా 1000 కోట్లు ఇస్తామని చెప్పిన మోడీ కేవలం 650 కోట్లు మాత్రమే ఇచ్చారు. అప్పటి కంటే ఇప్పుడు ఇంకా దారుణంగా కనీసం 10 శాతం కూడ ఇవ్వలేదు కేంద్ర సర్కార్.

Titli loss is Rs three Thousand crores , Titli loss is three Thousand crores if central helps is 229 crores , Titli Latest News, Titli toofan Latest News, Telugu News, Telugu Latest News.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *