ప‌రిహారం క‌థ మొద‌లాయె..

Titli toofan news
తీవ్ర‌మ‌యిన విషాదానికి అయినా ముగింపు అన్న‌ది ఉండి తీరాలి
బాధ‌నో దుఃఖాన్నో ఎవ్వ‌రో ఒక‌రు పంచుకుని తీరాలి
తిత్లీ గాయాలు మానిపోవాలి.. అందుకు యంత్రాంగం తీసుకుంటున్న చ‌ర్య‌లు
దోహ‌ద‌కారి కావాలి.. ఇలాంటి ఆశ‌లేవో మ‌న‌లో ప్రోది చేసుకుంటే మేలు.
ఇల్లు పోయింది
పొలం పోయింది
పంట నాశనం అయిపోయింది
ఏమి పోయినా ధైర్యం ఇంకా ఆ ఇల్లాలిలో ఉంది
ఓ ఎంపీటీసీ పేరు జాబితాలో ఉంటుంది
ఓ అన‌ర్హురాలు అర్హ‌త ద‌క్కించుకుని తీరుతుంది
ఏమీ లేని చోట అంతా బాగుంది  అన్న రాత అధికార యంత్రాంగం వెలువ‌రిస్తుంది
ఏం జ‌రిగినా ఓ ప్ర‌క‌ట‌న బాధితులంద‌రికీ న్యాయం జ‌రిగే వ‌ర‌కూ పోరాటం త‌ప్ప‌దు అని విప‌క్షం నుంచి విన‌వ‌స్తుంది
అంతా అనుకున్న‌ట్లే మంచే జ‌ర‌గాల‌ని ఆశిద్దాం. తుఫాను బాధితుల‌కు న్యాయం జ‌ర‌గాల‌నే కోరుకుందాం. ఎటువంటి రాజ‌కీయ జోక్యం లేని వ్య‌వ‌స్థ ఒక‌టి మ‌న మ‌ధ్యే ఉంద‌ని భావిద్దాం. ఈ నెల ఐదు న చంద్ర‌బాబు నాయుడు పంపిణీ చేసే ప‌రిహారంలో ఎటువంటి అవ‌క‌త‌వ‌క‌ల‌కు చోటే లేద‌ని విశ్వ‌సిద్దాం. ప‌లాస కేంద్రంగా జ‌రిగే నాటి కార్య‌క్ర‌మం త‌రువాత కూడా అర్హులంద‌రికీ గౌర‌వ క‌లెక్ట‌ర్ చెప్పిన‌ట్లే న్యాయం జ‌రిగి తీరుతుంద‌ని ఓ న‌మ్మ‌కం మ‌న‌లో నాటుకుందాం. ఇప్ప‌టికే ప‌రిహారాల జాబితాలు సిద్ధం అయ్యాయి క‌నుక ఎవ‌రెవ‌రో పేర్లూ ఊర్లూ గ‌ల్లంత‌య్యాయి క‌నుక ఇక విష‌య‌మై నో క‌మెంట్ .
పంట న‌ష్టాల‌ను ఇలా త‌గ్గించార‌ని తెలుస్తోంది
– 48 వేల ప‌శువుల పాక‌లు ప‌డిపోయాయ‌ని న‌మోదైతే
మ‌ళ్లీ స‌ర్వే చేయించి ఆ సంఖ్య 28 వేలు అని తేల్చారు
– 1.94 ల‌క్ష‌ల ఎక‌రాల్లో వ‌రి  పంట పోయింద‌ని
– కొబ్బ‌రి చెట్లు  11.70 ల‌క్ష‌లు నేల‌కొరిగాయ‌ని నిర్థారించారు.
ఇంకా లెక్క‌లలో త‌ప్పులు త‌డ‌క‌లు ఉన్నాయ‌ని వెల్ల‌డ‌వుతున్న వాస్త‌వాలే చెప్ప‌క‌నే చెబుతున్నాయి. ఈ త‌రుణాన బాధితులంద‌రికీ మేలు
జ‌ర‌గాల‌ని ఆశించ‌డం ఏమంత స‌బ‌బో ఇప్ప‌టికి ఓ అంచ‌నాకు అంద‌ని వైనం ఇది. ఇళ్లు పోయి చ‌లికి వ‌ణికి పోతూ బాధితులు ప‌డుతున్న అవ‌స్థ‌లు గౌర‌వ వ్య‌వ‌స్థ‌ను క‌ద‌లిస్తాయ‌ని, అందుకు అనుగుణంగా ప్ర‌జ‌ల బాధ‌లు వారికో మేల్కొల్పు కావాల‌ని అనుకోవ‌డం మ‌న‌వంతు.
తిత్లీ తుఫాను  కార‌ణంగా   ఎవ‌రో అన్న‌ట్లు మ‌నుషులు మారిపోయార‌ని, రాజ‌కీయ పార్టీలు రాజ‌కీయం చేయ‌డం మానుకున్నాయ‌ని
 ఇలా ఎవేవో అనుకోవ‌డం త‌ప్పు. ఇప్ప‌టిక‌యినా ముఖ్య‌మంత్రి రాక‌తో కొద్ది పాటి మార్పులు అయినా జ‌రిగి జాబితాలు స‌వ‌ర‌ణ‌కు నోచుకుంటే
మేలు. ఆ విధంగా అయినా బాధితుల‌కు  సాయం  అందితే మేలు.
Titli toofan news, Titli toofan update news, telugu news, telugu update news, Titli toofan.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *