ప‌రిహారంలో మ‌త‌ల‌బు

Titli Toofan Update News

తిత్లీ తుఫాను త‌రువాత ప‌రిణామాలు విడ్డూరంగా ఉన్నాయి
ప‌రిహారం అంద‌క కొంద‌రు అందినా అది అర‌కొర అనే విమ‌ర్శ‌ల్లో కొంద‌రు
ఉన్నారు ఇదే అదునుగా రాజ‌కీయ ప‌క్షాలు వారు వీరు అనే తేడా లేకుండా
సొంత లాభం చూసుకుని రెచ్చిపోతున్నారు. కొన్నింట అస్స‌లు త‌మ పేర్లే జాబితాలో
న‌మోదుకాక వీరంతా క‌న్నీటిప‌ర్యంతం అవుతున్నారు. ఇప్ప‌టికీ కూలిన కొబ్బ‌రి చెట్లు
నేల వాలిన జీడి తోట‌లు అలానే ఉన్నాయి.

శ్రీ‌కాకుళం : తిత్లీపై విజ‌యం అంటూ టీడీపీ శ్రేణులు బైక్ ర్యాలీలు చేసుకున్నాయి. త‌రువాత విజ‌యోత్స‌వ సంబ‌రాలు చేసుకున్నాయి. కానీ వాస్త‌వం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. క్షేత్ర స్థాయిలో ప‌రిహారం అంద‌క ఇప్ప‌టికీ అవ‌స్థ ప‌డుతున్న‌వారెంద‌రో.సోంపేట‌, మంద‌స మండ‌లాల్లో రైతులు అవ‌స్థ‌లు వ‌ర్ణ‌నాతీతంగా ఉన్నాయి. కొన్ని చోట్ల ప‌రిహారం న‌మోదు ప్ర‌క్రియ అస్త‌వ్య‌స్తంగా ఉంది.సోంపేట మండ‌ల ప‌రిధిలో 214 మందికి ఓకే సారి రెండు సార్లు ప‌రిహారం న‌మోదైంది.సిరిమామిడి కి చెందిన 167 మంది కొబ్బ‌రి రైతులు ప‌రిహారం అంద‌క ల‌బోదిబో అంటున్నారు.

Titli Toofan News, Titli Toofan Latest News, Srikakulam Latest News, Victory over Titli Toofan  has been made by bike rallies in the TDP Party Leaders , Titli Toofan Compensation News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *