తుఫాను ప‌రిహారం పంపిణీ నేడు

Toofan compensation

శ్రీ‌కాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను బాధితుల‌కు పరిహారం అందించ‌నున్నారు సీఎం. ఇందుకు సంబంధించి 482.58కోట్ల రూపాయ‌ల‌ను వెచ్చించను న్నారు. మొత్తంగా 520 కోట్ల రూపాయ‌ల‌ను విడుద‌ల చేసింది ప్ర‌భుత్వం. సోమ‌వారం మ‌ధ్యాహ్నం ప‌లాస‌లో జ‌ర‌గ‌నున్న బ‌హిరంగ స‌భ‌కు సీఎం విచ్చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా తిత్లీ బాధితుల‌ను ఆదుకోవ‌డంలో విశేషంగా సేవ‌లందించిన అధికారుల‌ను సైతం ఆయ‌న స‌న్మానించనున్నా రు. ఇక ప‌రిహారం విష‌యానికి వ‌స్తే హెక్టారు వ‌రికి ఇర‌వై వేల రూపాయ‌లు, జీడికి 30 వేల రూపాయ‌లు, ఒక్కో కొబ్బ‌రి చెట్టుకు 1500 రూపాయ‌లు, ధ్వంస‌మైన ఇంటికి ప‌దివేల రూపాయ‌లు, పాడైపోయిన వ‌ల‌కు ప‌దివేలు, దెబ్బ‌తిన్న మోటారు బోటుకు ల‌క్ష రూపాయ‌ల చొప్పున ప్ర‌భుత్వం చెల్లించి బాధితుల్ని త‌న‌వంతుగా ఆదుకోనుంది. ఈ మొత్తాల‌ను బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జ‌మ చేయ‌నున్నారు. ముందుగా ల‌బ్ధిదారుల‌కు న‌మూనా చెక్కులు అందించనున్నారు. వాటిని బ్యాంకుల్లో చూపిస్తే ల‌బ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జ‌మ అవుతుంది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ బ్యాంక‌ర్ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ బాధితుల‌కు రుణాలు ఉన్నా వాటిని మిన‌హాయించుకోవ‌ద్ద‌ని, మాన‌వ‌తా దృక్ప‌థంతో ప్ర‌భుత్వం అందించిన సాయాన్ని అంద‌జేయాల‌ని కోరారు.

వ్య‌వ‌సాయ శాఖ‌కు సంబంధించి వివ‌రాలిలా ఉన్నాయి
– 1,991,002.5 ఎక‌రాల్లో పంట‌న‌ష్టం వాటిల్లింది.
– బాధితుల సంఖ్య : 2,10,101
– ప‌రిహారం విలువ : 151.97కోట్ల రూపాయ‌లు
ఉద్యానవ‌న శాఖ‌కు సంబంధించి..
– 11.70 ల‌క్ష‌ల కొబ్బరి చెట్లు నేల‌కూలాయి
– 83,566 ఎక‌రాల్లో జీడి తోట‌ పోయింది
– బాధితుల సంఖ్య : 1,13,812
– ప‌రిహారం విలువ : 252.62 కోట్ల రూపాయ‌లు

Today Toofan compensation distribution , AP Latest News, Titli Toofana Update news, Telugu news ,Toofan compensation distribution , Srikakulam Latest News, 520 crs released from Central Govt.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *