ప్లీజ్ ఆ ప‌నిచేయొద్దు..త్రిష‌

Trisha Movie
హీరోయిన్ త్రిష స‌న్ టీవీ ఛానెల్‌ను ఆ ప‌ని మాత్రం చేయ‌కండి అంటూ ప్రాదేయ‌ప‌డుతుంది. ఇంత‌కు అదేమంటే.. విజ‌య్ సేతుప‌తి, త్రిష న‌టించిన చిత్రం `96`. ప్రేమ్‌కుమార్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం అక్టోబ‌ర్ 4న విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఇంకా సినిమా 80 శాతం థియేట‌ర్స్‌లో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. అయితే ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను కొన్న స‌న్ టీవీ చానెల్ మాత్రం `96` సినిమాను ఈ దీపావ‌ళికి ప్రసారం చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. అయితే సినిమా ఇంకా ర‌న్నింగ్‌లోనే ఉంద‌ని .. ఇప్పుడే ప్ర‌సారం చేస్తే డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ న‌ష్ట‌పోతార‌ని ద‌ర్శ‌కుడు ప్రేమ్‌కుమార్ ఆవేద‌న ప‌డ్డాడు. ఈ విష‌యం తెలుసుకున్న త్రిష త‌న ట్విట్ట‌ర్ ద్వారా `96` సినిమాను దీపావ‌ళికి కాకుండా సంక్రాంతికి విడుద‌ల చేసుకోమ‌ని కోరింది. మ‌రి దీనిపై ఛానెల్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

Trisha Movie,  Heroine Trisha , Sun TV channel , Vijay Setupathi, Trisha , New Movie 96 , Prem kumar Director,

Telugu Movie , Telugu Movie News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *