టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేకు కోర్టు నోటిసు

trs ex mla putta madhukar news
ఎనికలు సమీపిస్తున్న వేళ టీఆర్ఎస్ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు కు కోర్టు నోటీసులు జారీ చేసింది. గుండా నాగరాజు అనే వ్యక్తి ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న రమణారెడ్డి , పుట్టా మధు చెప్పిన మాటతోనే తానూ నాగరాజును ప్రోత్సహించానని చెప్పి మధు కు షాక్ ఇచ్చారు. ఆయన్ని కూడా సహ నిందితుడిగా చేర్చాలని కోరారు.

నాలుగు సంవత్సరాల క్రితం ఒక బహిరంగసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన గుండా నాగరాజు కేసులో సహ నిందితుడిగా మంథని తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ను చేర్చాలని బిళ్ల రమణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై వచ్చే నెల 9వ తేదీ వరకు సమాధానం చెప్పాలని మంథని అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టు జడ్జి నోటీసు జారీ చేశారు. 2013 జూన్‌ 6న మంథనిలో జరిగిన కేసీఆర్‌ బహిరంగసభలో గుండా నాగరాజు  అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. అయితే… నాగరాజు ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు బిళ్ల రమణారెడ్డి ప్రోత్సహించారని ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా.. ఈ కేసులో తాజా మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్‌ను కూడా చేర్చాలని, నాగరాజు ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహించాడని హైకోర్టు న్యాయవాది జీవి నాగమణి ద్వారా ఈ నెల 16న మంథని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జడ్జి నవంబర్‌ 9 లోపు సమాధానం చెప్పాలంటూ పుట్టా మధుకర్‌కు నోటీసు జారీ చేశారు.

trs ex mla putta madhukar news,court gives notices to ex mla putta madhukar,trs ex mla putta madhukar latest news,court gives notices to putta madhukar

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *