కాంగ్రెస్ కు షాకిచ్చే పనిలో టీఆర్ఎస్

trs party latest news

ఎన్నికల సమయంలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు పార్టీలు మారడం కొత్తేమీ కాదు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలుకావడంతో పలువురు నేతలు పార్టీలు ఇప్పటికే పార్టీ మారారు. అయితే కీలకమైన నాయకులు పార్టీ మారిన సందర్భాలు మాత్రం ఇంకా లేవనే చెప్పాలి. అయితే తెలంగాణలోని తమ ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు టీఆర్ఎస్ పార్టీ కాస్త లేటుగా ఓ వ్యూహాన్ని రచించిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ముఖ్యనేతలను పార్టీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ ముఖ్యనేతలు చర్చలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే టీఆర్ఎస్ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో…ఇక ఆ పార్టీలోకి కొత్తగా చేరికలు ఉండకపోవచ్చని చాలామంది భావించారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయకుండానే ముగ్గురు కీలక నేతలను ఎన్నికల తరువాత మంత్రి పదవులు ఇస్తామని టీఆర్ఎస్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు కొద్ది వారాల ముందు వీరు కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరాలని కోరుతున్నట్టు సమాచారం. ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ తరపున ప్రచారం చేయాలని… పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి పదవులు ఇస్తామని గులాబీ పార్టీ వీరికి హామీ ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ మారేందుకు ఎన్నికల్లో పోటీ చేయడమే అడ్డంకి అనుకుంటే… ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించేందుకు కూడా టీఆర్ఎస్ సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత, ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మరో సీనియర్ నాయకుడు, గ్రేటర్ పరిధిలోని మరో నాయకుడు ఈ జాబితాలో ఉన్నారని టాక్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా తమకు కీలక పదవులు దక్కే అవకాశం లేదని భావిస్తున్న ఆ నేతలు… టీఆర్ఎస్‌లోకి వెళతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వాలని భావిస్తున్న టీఆర్ఎస్… ఆ పార్టీలోని కీలక నేతలను తమ వైపు రప్పించుకోవడంలో ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది  చూడాల్సిందే.

trs party latest news,trs party shocks for congress party,3 members of congress party leaders are joining in trs party,trs party latest news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *