గులాబీ పార్టీలో ఆ ఇద్ద‌రికి టికెట్టు గుబులు

TRS Party News

ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా అంద‌రి చూపు మాత్రం న‌గ‌రం పైనే ఉంటుంది. ఎవ‌రెవ‌రు ఎక్క‌డెక్క‌డి నుంచి పోటీ చేస్తున్నారు అనే విష‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రు గ‌మ‌నిస్తూ ఉంటారు. ఎన్నిక‌లంటేనే న‌గ‌రంలో కొంద‌రి ముఖాలు అంద‌రికి జ్ఞాప‌కం వ‌స్తాయి. వీరిలో ముందు వ‌రుస‌లో ఉండేది తెలంగాణ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి, ఆ త‌రువాత దానం నాగేంద‌ర్ పేరు గుర్తుకు వ‌స్తుంది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో జ‌రిగే ముంద‌స్తు ఎన్నిక‌ల్లో వీరి మ‌నుగ‌డ ఇబ్బంది క‌రంగా మారింది. 105 సీట్ల‌ను ప్ర‌క‌టించిన కేసీఆర్ వీరిద్ద‌రు ఆశిస్తున్న సీట్ల‌ను మాత్రం పెండింగ్‌లో పెట్ట‌డం చ‌ర్చ‌ణీయాంశంగా మారింది. ఈ ఇద్దరు నేతలకి టిక్కెట్ విషయంలో ఇంతవరకు స్పష్టత రాలేదు. అసలు వీరికి ఏ నియోజకవర్గాల టిక్కెట్ దక్కుతాయి అంటూ అనుచరులు ఆందోళన చెందుతున్నారు. నాయిని నర్సింహారెడ్డి తెరాస అధిష్టానం ముందు రెండు ఆప్షన్లు పెట్టారు. ముషీరాబాద్‌ నుంచి తన అల్లుడు, కార్పొరేటర్‌ శ్రీనివా‌స్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వాలని.. అది వీలు కాకపోతే తనకు టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే, అధిష్ఠానం ఈ సీటు విషయంలో ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో నాయినితో పాటు ఆయన అనుచరులు అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అని ఎదురు చూస్తున్నారు.ఇక దానం నాగేందర్‌ విషయానికొస్తే.. మొదట్లో తనకు ఖైరాతాబాద్‌ టిక్కెట్ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తర్వాత అధిష్ఠానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానన్నారు. కానీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయం ఇప్పటి వరకు తేలలేదు. ఖైరతాబాద్‌ నుంచి ముగ్గురు టిక్కెట్ రేసులో ఉన్న నేపథ్యంలోనే ఇక్కడి అభ్యర్థిని ప్రకటించకుండా తెరాస అధిష్టానం పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు దానంను గోషామహల్‌ నుంచి బరిలోకి దింపుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ విషయంలోనూ స్పష్టత లేదు. ఒకప్పుడు హైదరాబాద్ నగర రాజకీయాల్లో చక్రం తిప్పిన దానం ఇప్పుడు పార్టీ అధినేత ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు అంటూ దానం మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారు. వీర‌ద్ద‌రి రాజ‌కీయ భ‌విష్య‌త్తు న‌గ‌రంలో హాట్‌టాపిక్ గా మారింది.

TRS Party News , Home Minister Naini  Narasimha  Reddy , Danam Nagender , Telanagana Political News,

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *