కూటమిని చిన్నాభిన్నం చేసే కేసీఆర్ భారీ కుట్ర ఇదేనా

TRS Party news

సీట్ల ప్రకటనకు సమయం దగ్గర పడటంతో.. ఆ కూటమిని విచ్చిన్నం చేసే ప్లాన్ లో ఉన్నారు. టిక్కెట్లు రాని నియోజకవర్గ స్థాయి నేతలందరినీ ఆపరేషన్ ఆకర్ష్ అనాలని చూస్తున్నారు. ఓ విలువ కట్టి కారెక్కించడానికి రెడీ అయిపోయారు గులాబీ బాస్ . కాంగ్రెస్ నుంచి సీట్లను ఆశిస్తున్న అభ్యర్థులు ఒక్కో నియోజకవర్గంలో నలుగురు, ఐదుగురు వరకు ఉంటె వారిలో ప్రజల్లో పేరున్న నాయకులను, ఓటు బ్యాంకు ఉన్న నాయకులను సెలెక్ట్ చేసే పనిలో ఉన్న గులాబీ బాస్ ఇప్పటికే వారికి ఆఫర్లను ప్రకటిస్తూ తన పావులు కదుపుతున్నారు. ఇక టీడీపీ, టీజేఎస్, సీపీఐలకు ఇచ్చిన తర్వాత… నిరాశ పడే సీటు ఆశావహులు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళను సైతం తమ పార్టీలోకి తీసుకునే ఆలోచనలో ఉన్న కేసీఆర్ మహకూటమిని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ నేతల అసంతృప్తిని వాడుకోవాలని నిర్ణయించారు.
కూటమిలో అభ్యర్థుల ప్రకటన తర్వాత కాంగ్రెస్‌కు సినిమా చూపిస్తామంటూ… టీఆర్ఎస్ ముఖ్య నేతలు ప్రకటనలు చేస్తున్నారు.అయితే.. కారెక్కించడం మాత్రమే ప్లాన్‌లో భాగంగా కాదు. వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో.. బలమైన కాంగ్రెస్ అభ్యర్థుల్ని.. రెబెల్స్‌గా నిలబెట్టేందుకు సైతం కసరత్తు చేస్తున్నారు. తద్వారా కూటమి ఓటు బ్యాంకు చీల్చే యోచనలో ఉన్నారు. అదే గనుక జరిగితే టీఆర్ ఎస్ కు లాభం.
హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, కొత్తగూడెం నియోజకవర్గం నుంచి వనమా వెంకటేశ్వరరావు,శేరిలింగంపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ ల సీట్లు పొత్తుల్లో పోయే సీట్లే. వీరిని ఇండిపెండెంట్లుగా పోటీ చెయ్యటానికి కావాలంటే ఆర్థిక సాయం కూడా అందిస్తామని హామీ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది.ఇలా మెజార్టీ నియోజకవర్గాల్లో రెబెల్స్ కాంగ్రెస్ గెలుపు అవకాశాల్ని దెబ్బకొట్టేలా ప్లాన్ చేసుకున్న గులాబీ దళం కాంగ్రెస్ జాబితా ప్రకటిస్తే అప్పుడు అసలు సినిమా చూపిస్తామని చెప్తున్నారు.

TRS Party news,

KCR political news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *