గులాబీ పార్టీలో టికెట్ దక్కే12 మంది?

TRS Party News

ఈ నెల 12న ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్ వెయ్యాల్సిన నేపధ్యంలో టీఆర్ఎస్ ఇప్పటి వరకు ప్రకటించని స్థానాలతో పాటు అభ్యర్థులకు బీ ఫాం లను ఇవ్వటానికి ఈనెల 11న ముహూర్తం ఖరారు చేసుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు నవంబర్ 11 వ తేదీన బీ ఫారాల తో పాటు అదే రోజున 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థులంతా అందుబాటులో ఉండాలని టీఆర్ఎస్ నాయకత్వం ఫోన్ చేసి అభ్యర్థులకు చెప్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 6 వ తేదీన 105 మంది స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులతో టీఆర్ఎస్ జాబితాను ప్రకటించింది. ఈ స్థానాల్లో అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. 105 మంది అభ్యర్థులకు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నవంబర్ 11వ తేదీన బీ ఫారాలు అందించనున్నారు.ఈ మేరకు టీఆర్ఎస్ అధిష్టానం బీ ఫారాలు తీసుకొనేందుకు నవంబర్ 11వ తేదీన అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫోన్లు చేశారు.

నవంబర్ 12వ తేదీన ఎన్నికల నోటీఫికేషన్ విడుదల కానుంది. ప్రకటించని స్థానాల్లో టికెట్టు కేటాయించే అభ్యర్థులను అందుబాటులో ఉండాలని టీఆర్ఎస్ నాయకత్వం ఫోన్లు చేసింది. ప్రతి ఒక్క అభ్యర్ధికీ ఒక్కో లాయర్ ను కేటాయించనున్నారు. నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా ఉండేందుకు న్యాయవాదులను టీఆర్ఎస్ అభ్యర్ధులకు కేటాయించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది. ఈ నెల 24, 25,26 తేదీల్లో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేటీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో కేటీఆర్, హరీష్ రావు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు అధిష్టానం నుండి వస్తున్న ఫోన్ కాల్స్ తో పార్టీ అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇంకా టికెట్ కేటాయించని 12 నియోజకవర్గాల్లో ఎవరికి ఫోన్ కాల్ వచ్చిందనే దానిపైన ఆశావహులు మల్లగుల్లాలు పడుతున్నారు.

TRS Party News, Telugu news TRS Party latest News,Telangana Elections News, On September 6, TRS announced list of candidates contesting 105 seats 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *