టీఆర్ఎస్ ను సాగనంపండి

TRS will continues the

  • వారికి ఇవే చివరి ఎన్నికలు కావాలి
  • టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు

తెలంగాణలో టీఆర్ఎస్ భవిష్యత్తును కనుమరుగు చేయాలని, ఈ ఎన్నికలే కేసీఆర్ కు చివరి ఎన్నికలు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పార్టీ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య తరఫున బుధవారం ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ అస్తవ్యస్త విధానాల వల్లే తెలంగాణ దెబ్బతిందని, ధనిక రాష్ట్రాన్ని అప్పలుపాలు చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీ లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ పగలు బీజేపీతో, రాత్రి ఎంఐఎంతో స్నేహం చేస్తున్నారని బాబు విమర్శించారు. ‘రాష్ట్రంలో కేసీఆర్‌ ఒక్క పని కూడా చేయలేదు. ఓట్ల కోసం ఇప్పుడు మాయమాటలు చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోయి, ఆయన కట్టుకున్న ఫాంహౌస్ లో విశ్రాంతి తీసుకుంటారు. ఈసారి గెలిచేది ప్రజా కూటమే. ఇందులో అనుమానమే లేదు’ అని స్పష్టంచేశారు. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్‌లకు ఓటు బ్యాంకు, క్యాడర్‌ బలంగా ఉన్నాయని.. ఈ రెండు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేసి టీఆర్ఎస్ కు డిపాజిట్లు రాకుండా ఓడించాలని పిలుపునిచ్చారు.

Buy the Latest smart Phone Cheaper Price 

ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే.. 37 ఏళ్ల వైరాన్ని పక్కనబెట్టి కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు. అనంతరం కోదాడలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డిసెంబర్‌ 11 తర్వాత ఆపద్ధర్మ సీఎంగా ఉన్న కేసీఆర్‌.. మాజీ సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా ఒక్కరోజు కూడా సెక్రటేరియట్‌కు వెళ్లలేదని చంద్రబాబు దుయ్యబట్టారు. దేశంలో రెండే కూటమిలు ఉన్నాయని.. బీజేపీ కూటమిలో ఉంటారా? బీజేపీయేతర ఉంటారా టీఆర్ఎస్, ఎంఐఎం తేల్చుకోవాలన్నారు. టీఆర్ఎస్ గాడి తప్పిన వ్యవస్థలను మళ్లీ గాడిలో పెట్టాంటే ప్రజాకూటమికి పట్టం కట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *