అధ్యక్షుడిగా తొలగిస్తే అమెరికా ఆర్ధిక సంక్షోభం

Trump Against His Enemies

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను అధ్యక్ష పదవి నుండి తప్పిస్తే అమెరికా మార్కెట్ మొత్తం కుప్పకూలిపోతుంది. అమెరికా ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తింటుంది అని వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో అమెరికా ప్రచార చట్టాలను ఉల్లంఘించిన కేసులో ట్రంప్ పర్సనల్ లాయర్ మైఖేల్ కోహెన్ కోర్టులో ట్రంప్ కోసమే ఇద్దరు మహిళల్ని డబ్బు తో ప్రభావితం చేశానని చెప్పారు. అంతే కాక ట్రంప్ కు వారికి వ్యక్తిగత సంబంధం వుందని చెప్పి ఆయన సూచన మేరకే ఓ పోర్న్ స్టార్, మరో మోడల్‌కు తాను డబ్బులు ఇచ్చినట్లు చెప్పారు.
దీంతో ట్రంప్ ను పదవి నుండి తొలగించాలని అభిశంసన తీర్మానం పెట్టాలనే యోచనలో వున్నారు అక్కడి పార్లమెంట్ సభ్యులు. దీంతో తనపై ఉన్న సెక్స్ స్కాండల్ ను అడ్డు పెట్టుకుని తనను తొలగించాలని చూడటం అందర్నీ చిక్కుల్లో పడేస్తుందని ఊహించని ఫలితాలను చవిచూడాల్సి వస్తుందని ట్రంప్ ఫ్యాక్ట్స్ అండ్ ఫ్రెండ్స్ అనే కార్యక్రమంలో చెప్పారు. తాను అధ్యక్షుడిగా ఎన్నో గొప్ప పనులు చేశానని తనను ఎలా అభిశంసించాలనిపిస్తుంది అని ఆయన ప్రశ్నించిన ట్రంప్ అంతే సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు.

America Breaking News,Donald Trump Updates,International News,Trump Warns About America Finance,US Collapsed Says Trump,Telugu News,Breaking News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *