టీటీడీపీ మల్కాజ్ గిరి ఇంచార్జ్ అరెస్ట్

TTDP Malkajgiri Incharge

తెలంగాణాలో ఎన్నికలు దగ్గర పడుతుంటే కూటమి శ్రేణులకు అరెస్ట్ ల భయం పట్టుకుంది. ఎప్పుడు ఏ పార్టీ నాయకులు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఎప్పుడో జరిగిన ఘటనలలో ఇప్పుడుకేసులు పెట్టి అరెస్ట్ లు చెయ్యటం కూటమి నేతలకు ఇబ్బంది కలిగిస్తుంది. గతంలో కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, తర్వాత రేవంత్ రెడ్డి ల పై కేసుల అనతరం ఇప్పుడు దృష్టి టీడీపీ నాయకుల వైపు మళ్ళింది. కేంద్రం సహాయంతో కూటమి మీద కుట్రలు చేస్తున్న టీఆర్ఎస్ హస్తం కూటమి నేతల అరెస్ట్ ల వెనుక వుంది అనేది కూటమి శ్రేణుల వాదన.
తాజాగా టీ తెలుగుదేశం కి సంబంధించిన మల్కాజ్ గిరి ఇంఛార్జ్ రామకృష్ణ యాదవ్ ని పోలీసులు అకస్మాత్తుగా అరెస్ట్ చెయ్యటం వెనుక కూడా టీఆర్ఎస్ వుంది అన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ మధ్య బోనాల పండుగ రోజున విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసులను అడ్డుకున్నందుకు గాను ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా ఇంటికెళ్ళి మరీ ఇంట్లో వున్నా రామకృష్ణను అరెస్ట్ చేశారు పోలీసులు. అసలు ముందస్తు నోటీ.సులు కూడా ఏం పంపకుండా అరెస్ట్ చెయ్యడం ఏమిటని రామకృష్ణ ప్రశ్నించారు.. ఆయన స్వగృహంలో ఉండగానే పోలీసులు వచ్చి ఆయన మాట్లాడేది ఏమి వినిపించుకోకుండా తీసుకెళ్లిపోయారు.
అయితే రామకృష్ణ యాదవ్ పైన జరిగిన ఈ చర్య ఆయన అరెస్ట్ వెనుక కూడా టీఆర్ఎస్ హస్తం ఉందని, ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్యే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అప్పుడు కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి , రేవంత్ రెడ్డి మీద దాడులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన నేత రామకృష్ణ మీద ఏ నోటీసులు లేకుండా అరెస్ట్ చెయ్యడం ఇవన్నీ ఆ పార్టీ కుట్రే అని తెలుగు తమ్ముళ్ళ వాదన. ఏది ఏమైనా టీఆర్ఎస్ ఆడుతున్న మైండ్ గేమ్ లో భాగమే ఈ అరెస్ట్ లని అర్ధం అవుతుంది. లేకుంటే ఎప్పుడో జరిగిన చిన్న ఘటనకు పని గట్టుకుని ఇప్పుడు అరెస్ట్ చెయ్యటం అంటే అంతే కదా అని టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి.

TTDP Malkajgiri Incharge  Arrest , telangana tdp party malkajgiri incharge arrest,telangana elections ,Jagga reddy , revanth reddy , TTDP Malkajgiri Incharge  Ramakrishna Yadav

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *