కూటమి పెట్టిన చిచ్చు … రగిలిపోతున్న తెలుగు తమ్ముళ్ళు

తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ బలం, బలగం గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ లేనేలేదు అని నీలుగుతున్న అధికార పక్ష నేతలకి నిద్రలో కూడా కూడా వెన్నులో వణుకు పుట్టించే సత్తా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఆ గొప్పతనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది. పార్టీ పుట్టింది ఆ గడ్డ మీదే అయినా తెలంగాణా ఎన్నికల్లో పోటి చేయడానికి విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ తో కలిసి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ప్రత్యర్ధులు ఆంధ్రా పార్టీ అనే ముద్ర వేసినా సరే గత ఎన్నికల్లో తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తో సమానంగా తెలుగుదేశం పార్టీ కూడా సీట్లు సాధించుకుంది. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో నాయకుల స్వార్ధ ప్రయోజనాలతో గెలిచినా ఒక్కొక్కరు పార్టీ మారుతూ వచ్చారు. దీనితో నాయకత్వం లేక పార్టీ ఇబ్బంది పడింది.

అయితే క్యాడర్ మాత్రం చెక్కు చెదరలేదు అనే అభిప్రాయం ఉంది.. చాలా జిల్లాల్లో పార్టీ క్షేత్ర స్థాయిలో చాలా బలంగా ఉంది. ఇలాంటి బలమైన పునాది ఉన్న పార్టీ వేరొకరితో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళడం అనేది కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేకపోయారు. పొత్తు లేకుండా తెలుగుదేశ౦ బరిలోకి దిగినా ప్రతి నియోజకవర్గంలో దాదాపు 5 వేలకు పైచిలుకు ఓట్లు సాధించేది అనేది వాస్తవం. కీలక నాయకులు పార్టీ మారడం, బిజెపితో రహస్య ఒప్పందం చేసుకున్న తెరాస ని దెబ్బకొట్టాలి అంటే ఈ ఎన్నికలు కీలకం కాబట్టి పొత్తు పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది అందరికి తెలిసిన వాస్తవం. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి 14 సీట్లను కేటాయించారు. దీనితో 36 ఏళ్ళ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ తో స్నేహం చేయడం మొదలుపెట్టారు తెలుగుదేశం కార్యకర్తలు. అయితే ఇక్కడ పార్టీ అధిష్టానం మీద తీవ్ర ఆరోపణలు వినపడుతున్నాయి. చంద్రబాబుకి ఉన్న రాజకీయ పరిజ్ఞానానికి ఎన్నికలకు వెళ్ళే ముందు అన్ని నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్ధిని నిలబెట్టినా ఒక్కో స్థానం నుంచి ఒక్కో నాయకుడు తయారయ్యేవాడు. అప్పుడు నాయకత్వ లేమి సమస్యను తప్పించుకునే అవకాశం ఉండేదని కార్యకర్తలు అభిప్రాయపడుతూ.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ 14 స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో సీట్లు వచ్చిన అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, మండల మరియు గ్రామా స్థాయి నాయకులని నయానో, భయానో బెదిరించి లొంగదీసుకుని పరిస్థితులకి అధినాయకత్వమే అవకాశం ఇచ్చినట్లు కార్యకతలు భావిస్తున్నారు.

తెలుగుదేశం బలం ఆ పార్టీకి తెలియకపోయినా.. కాంగ్రెస్ కి, తెరాస కి మాత్రం స్పష్టంగా తెలుసు.. అందుకే తెరాస అధినతే పదే పదే చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. తీసుకున్న 14 స్థానాలకు కూడా ముందస్తుగా అభ్యర్ధులని ఎంపిక చేసుకోకుండా, అభ్యర్థుల మధ్యలో మనస్పర్థలకు తావిస్తూ చివరి నిమిషంలో సీట్లు ప్రకటిస్తూ నాయకత్వం చేస్తున్న ఈ సర్కస్ ఫీట్ల పట్ల తెలుగు తమ్ముళ్లు లోలోపల రగిలిపోతున్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా రోడ్డుమీదకు వచ్చి నిరసన తెలియచేయలేక పోతున్నాము కానీ మాకు తీవ్ర అసంతృప్తి ఉంది సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా ఇచ్చే 14 సీట్ల కోసం ఇన్ని రోజులు కాంగ్రెస్ నుంచి సమాధానం కోసం ఎదురుచూడటం వారిలో అసంతృప్తిని పెంచుతుంది. ఇప్పటికయినా తెలుగుదేశం నాయకత్వం కార్యకర్తల అసంతృప్తిని గుర్తించి వారిని సమాధానపరిచేలా ఒక ప్రకటన చేస్తే మంచిది.

ttdp party news,telugu desam party political news,telangana tdp leader serious on congress leaders, tdp leaders sensational comments on congress leaders

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *