ఇర‌వై దేశాల ఫ‌ర్నీచ‌ర్ బ్రాండ్స్.. హైద‌రాబాద్లో

Telugu Breaking News
ఇంటిని కాస్త డిఫ‌రెంట్‌గా, యూనిక్‌గా డిజైన్ చేసుకోవాల‌ని కోరుకుంటున్నారా? అయితే, మీలాంటి వారికోస‌మే ఇర‌వై దేశాల విభిన్న‌మైన ఫ‌ర్నీచ‌ర్ బ్రాండ్స్ గ‌ల హైఎండ్ షోరూము ప్రారంభ‌మైంది. అది ఏ అమెరికానో, ఇట‌లీలోనో కాదు.. హ‌మారా ష‌హ‌ర్ అయినా హైద‌రాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబ‌ర్ 12లోని ఎలివేట్ ఎక్స్ (ELEVATE X) కొలువుదీరింది. ఇందులోకి విచ్చేస్తే చాలు.. ఇంటికి కావాల్సిన ఫ‌ర్నీచ‌ర్‌ను తీసుకోకుండా ఉండ‌లేరంటే న‌మ్మండి. మొత్తం ఏడు అంత‌స్తుల్లో ఆరంభ‌మైన ఈ షోరూములో ప్ర‌తి ఫ్లోరు త‌న ప్ర‌త్యేక‌త‌ను నిరూపించుకుంటుంది. ఒక్కో ఫ్లోరును ఒక్కో టాప్ డిజైన‌ర్ ఏర్పాటు చేశారు. ఐటీ, ఫార్మా వంటి రంగాలు డెవ‌ల‌ప్ కావ‌డంతో విదేశాల‌కు వెళ్ల‌డం, అక్క‌డి లైఫ్ స్ట‌యిల్‌ని చూసిన‌వారంతా.. ఇక్క‌డ కూడా అలాంటి లైఫ్ స్ట‌యిల్ కావాల‌ని కోరుకుంటున్నారు. అందుకే, ప్ర‌పంచంలోనే బెస్ట్ బ్రాండ్స్‌ను బంజారాహిల్స్ రోడ్ నెంబ‌ర్ 12లో ఎలివేట్ ఎక్స్‌లో శ్రీకారం చుట్టారు.
Telugu Breaking News
ముప్ప‌య్ మూడేళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల ఫ‌ర్నీచ‌ర్ రంగంలో త‌న‌దైన ప్ర‌త్యేక ముద్ర వేసిన వ్య‌క్తి.. ఖ‌జానా గ్రూప్ సీఎండీ భ‌వంత్ ఆనంద్‌. ఆయ‌న విజ‌న్‌, ప‌క్కా ప్ర‌ణాళిక‌, కొత్త‌ద‌నం కోసం నిత్యం త‌ప‌న‌.. అందుకే ఈ సంస్థ‌కు ల‌క్ష మంది శాటిస్‌పైడ్ క‌స్ట‌మ‌ర్లు  వ‌చ్చి చేరారు. ఇప్ప‌టివ‌ర‌కూ ప‌ది వేల ప్రాజెక్టుల‌ను ఈ సంస్థ అవ‌లీల‌గా పూర్తి చేయ‌గ‌లిగింది. 1999లో 2000 చ‌ద‌ర‌పు అడుగుల్లో రాట్ ఐర‌న్ షోరూమును ప్రారంభించింది. 2001లో 10 వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో 36 జూబ్లీహిల్స్‌లో శ్రీకారం చుట్టింది. 2006లో ప‌న్నెండు వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో ఇంటీరియ‌ర్స్ విభాగాన్ని ప్రారంభించింది. 2008లో 30,000 చ‌ద‌రపు అడుగుల్లో విదేశీ ఫ‌ర్నీచ‌ర్ షోరూమును ఆరంభించింది. 2011లో ఏకంగా అరవై వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో మ్యాన్యుఫ్యాక్చ‌రింగ్ విభాగానికి శ్రీకారం చుట్టింది. 2013 జూబ్లీహిల్స్‌లో ప్రీమియం గ్లోబ‌ల్ బ్రాండ్ ఎలివేట్ ను మొద‌లెట్టింది. ఇలా త‌న ప్ర‌యాణాన్ని నిత్యం కొన‌సాగిస్తూ.. తాజాగా 50,000 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఎలివేట్ ఎక్స్ అనే ఫైనెస్ట్ (finest) బొటిక్ షోరూమును బంజారాహిల్స్ రోడ్ నెంబ‌ర్ 12లో ఆరంభించింది. అయితే, ఈ సంస్థ ఇక్క‌డితోనే ఆగిపోవ‌డం లేదు. ఇలాంటివే దేశ‌వ్యాప్తంగా దాదాపు యాభై స్టోర్ల‌ను ప్రారంభించ‌డానికి సంస్థ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ది.
దాదాపు ఇర‌వై దేశాల‌కు చెందిన ల‌గ్జ‌రీ ఫ‌ర్నీచ‌ర్ బ్రాండ్స్ ఇందులో ల‌భిస్తాయి. మోడ్ర‌న్ సోఫాలు, హై ఎండ్ డైనింగ్ టేబుల్స్‌, ల‌గ్జ‌రీ బెడ్స్‌, మాడ్యులార్ కిచెన్స్‌, రిక్ల‌యిన‌ర్స్‌ (recliners), ఆర్టీక్రాఫ్ట్స్‌( articrafts), రూమ్ డిజైన్స్ వంటివాటికి లెక్కే లేదు. వీటి డిజైన్, త‌యారీ విధానం, అందుకు వినియోగించే వ‌స్తువులు, ఫినిషింగ్ ఆధారంగా ధ‌ర‌లుంటాయ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరెన్నిక గ‌ల ల‌గ్జ‌రీ బ్రాండ్స్ ఫ‌ర్నీచ‌ర్‌కు కేరాఫ్ అడ్ర‌స్.. బంజారాహిల్స్ రోడ్ నెంబ‌ర్ 12లోని ఎలివేట్ ఎక్స్‌. దాదాపు ఇర‌వై, ముప్ప‌య్ దేశాల్లో టాప్ కంపెనీల‌కు చెందిన బ్రాండెడ్ ఫ‌ర్నీచ‌ర్ ఇందులో దొరుకుతుంది. ఇంటిని కాస్త భిన్నంగా ఉండాల‌ని కోరుకునేవారి కోస‌మే ఈ షోరూమును ఖ‌జానా గ్రూప్ ఇండియా.. ఎలివేట్ ఎక్స్ (elevate x) షోరూమును ప్రారంభించింది.
ఇందులో సుఖ‌మ‌య నిద్ర‌ను అందించే బెడ్స్.. రూ. 2 ల‌క్ష‌ల నుంచి ప్రారంభ‌మ‌వుతాయి.
డైనింగ్ సెట్ (టేబుల్‌, కుర్చీలు): 3 ల‌క్ష‌ల నుంచి దొరుకుతాయి.
ఫ్యాబ్రిక్  సోఫా: రూ.2.5 ల‌క్ష‌లు,
లెద‌ర్ సోఫా:  రూ. 4 ల‌క్ష‌ల నుంచి ల‌భిస్తాయి.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *