గ‌జం ప్లాట్ రూ.1.53 ల‌క్ష‌లు

* ప్లాట్ల వేలంతో హెచ్ఎండీఏకు జ‌వ‌స‌త్వాలు
* క‌ళ్లుతిరిగే ధ‌ర‌లు ప‌లికిన భూములు
హెచ్ఎండీఏ ఒక‌ప్పుడు పెద్ద పెద్ద అభివృద్ధి ప‌నులు చేసిన సంస్థ‌. హైద‌రాబాద్‌లో బ‌డా పార్కుల నుంచి ప‌దేళ్ల కింద‌టి వ‌ర‌కు ఏ భారీ ప్రాజెక్టు చేప‌ట్టినా హెచ్ఎండీఏనే చేయాల‌నుకునే వారు. అలాంటి వ్య‌వ‌స్థ నిధులు లేక రానురాను చాలా నీర‌సించింది. ఎక్కువ ప్రైవేటు సంస్థ‌ల‌కే ప్రాజెక్టులు ఇచ్చేందుకు జీహెచ్ఎంసీ, ప్ర‌భుత్వం ఉత్సుక‌త చూప‌డంతో ఈ సంస్థ‌కు నిధులు లేక‌, ఉద్యోగులూ లేక ఉనికే ప్ర‌మాదంలో ప‌డిపోయింది. ఈ క్ర‌మంలో కొత్త‌గా వ‌చ్చ‌ిన క‌మిష‌న‌ర్‌, ఇత‌ర అధికారులు దానికి జ‌వ‌స‌త్వాలు చేకూర్చే ప‌నిలో ప‌డ్డారు. ఆఫ‌లిత‌మే హెచ్ఎండీఏ ప‌రిధిలోని భూముల‌ను ప్లాట్లుగా చేసి విక్ర‌యించ‌డం. ఇలా విక్ర‌యాలు కూడా వేలం ద్వారా చేప‌ట్ట‌డంతో ఎప్పుడూ ఊహించ‌నంత ఆదాయంతో హైద‌రాబాద్ మెట్రో డెవ‌ప‌ల్‌మెంట్ అథారిటీ వెలిగిపోతోంది.
ఈ నెల‌లో హెచ్ఎండీఏ త‌న 210 ప్లాట్ల‌ను వేలంగా వేయ‌గా మాదాపూర్, అత్తాపూర్‌లో ఉన్న ప్లాట్లు అత్యంత ఎక్కువ ధ‌ర‌కు వేలంలో పోయాయి. మొద‌ట మాధాపూర్‌లో గ‌జం ప్లాంట్ రూ.1.51 ల‌క్ష‌ల‌కు వేలంలో పోగా.. దాన్ని త‌ల‌ద‌న్నేలా అత్తాపూర్‌లోని ప్లాట్ రూ.1.53 ల‌క్ష‌ల ధ‌ర ప‌లికింది. మొత్తం 200 ప్లాట్ల వేలంలో ఒక్క 21 మిన‌హా అన్నీ అమ్ముడుపోయాయి. వీటి ద్వారా రూ.300 కోట్ల‌పైనే ఆదాయం స‌మ‌కూరింది. ఇంత ఆదాయం వ‌స్తుంద‌ని అధికారులూ ఊహించ‌లేదు. మొద‌ట రూ.100 నుంచి 150 కోట్లు వ‌స్తుంద‌ని ఆన్‌లైన్‌లో వేలం నిర్ణ‌యించారు. వేలంలో పాల్గొనేవారు రూ.10వేలు చెల్లించి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సింద‌ని సూచించ‌గా ఇంత పెద్ద‌ మొత్తం రిజిస్ట్రేష‌న్‌కే అయితే ఎలా అని అప్ప‌ట్లో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దాంతో ఆ మొత్తాన్ని రూ.వేయికి త‌గ్గించారు. చాలా మంది రిజిస్ట్రేష‌న్ చేయించుకుని వేలంలో పాల్గొన్నారు. మిగిలిన 21 ప్లాట్ల‌లో బాచుప‌ల్లిలో 1, దూల‌ప‌ల్లిలో 1, భువ‌న‌గిరిలో 5, ఘ‌ట్‌కేస‌ర్‌లో 7, జ‌ల్‌ప‌ల్లిలో 1, షేక్‌పేట్‌లో1, శంక‌ర్‌ప‌ల్లిలో 1 ప్లాట్ మాత్ర‌మే ఉన్నాయి. వీటినీ అదును చూసి వేలం వేస్తామ‌ని అధికారులు తెలిపారు. వ‌చ్చిన ఆధాయంలో ఇక న‌గ‌రంలో త‌మ ప్రాజెక్టుల‌ను గ‌ట్టెక్కిస్థామ‌ని హెచ్ెండీఏ క‌మిష‌న‌ర్ చిరంజీవులు చెప్పుకొచ్చారు.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *