కూటమి సీఎం అభ్యర్థిపై ఉత్తమ్ కుమార్?

uttam kumar latest news

టీఆర్ఎస్ పై పోరాటానికి దిగిన మహాకూటమి నుండి సీఎం అభ్యర్థి ఎవరు? రేవంత్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తున్న చోట సీఎం రేసులో ఉన్న ప్రధాన పార్టీ నాయకులు ఇంకా ఎవరెవరు ఉన్నారు. ఒక పక్క టీఆర్ఎస్ గెలిస్తే సీఎం కేసీఆర్ అని ఒక క్లారిటీ వుంది. కానీ కూటమి నేతలకు సీఎం అభ్యర్థి విషయంలో ఆ క్లారిటీ లేదు. రాహుల్ గాంధీ ఏ పేరు చెపితే వాళ్ళే సీఎం అభ్యర్థి అని చెప్తున్న హస్తం నేతలు ప్రత్యర్ధి పార్టీలను దీటుగా ఎదుర్కొనే నాయకుడు ఎవరో తేల్చుకోలేక పోతున్నారు.

కాంగ్రెస్ పార్టీ లో సీనియర్లకు కొదవ లేదు. పార్టీకోసం పని చేసినా చెయ్యకున్నా సీఎం అంటే చాలు నేనంటే నేను అంటూ అందరూ ముందుకు వస్తారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు ప్రత్యర్ధి పార్టీలను టార్గెట్ చేసి ముందుకు సాగుతున్నాయి. టీఆర్ఎస్ ను ఓడించటానికి కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ లు కలిసి సాగుతున్నాయి. టీఆర్ఎస్ నుండి సీఎం గా కేసీఆర్ అయితే ఒకవేళ మహాకూటమి గెలిస్తే సీఎం ఎవరు అన్న ప్రశ్న ప్రజలకు సైతం వుంది.

అయితే కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కొనే నేత, మాటలతో అందర్నీ ఆకట్టుకోగల నేత రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థి అని ఒక పక్క ప్రచారం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్ పొలిటీషియన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , జానా రెడ్డి తదితరులు కూడా సీఎం కావాలనే ఆలోచనలో ఉన్నారు. కొన్ని సందర్భాల్లో బాహాటంగా వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం ఉన్న కూటమి పొత్తుల్లో మిత్ర పక్ష పార్టీల మద్దతు కూడా కావాల్సి వుంటుంది. అదే జరిగితే రేవంత్ రెడ్డి కి ఎక్కువ అవకాశం వుంటుంది. అయితే ఈవిషయం పై ప్రస్తుతానికి ఏ నిర్ణయం తీసుకోలేదని రాహుల్ గాంధీ తో చర్చించి ఎన్నికల ఫలితాల అనంతరం మాత్రమే నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గెలిచిన ఎమ్మెల్యేల అభీష్టం మేరకే సీఎం ఎవరో ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

uttam kumar latest news,tpcc president uttam kumar sensational comments on cm candidate in congress,uttam kumar comments mahakutami cm candidate

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *