కాంగ్రెస్ తొలి జాబితాలో ఉత్తమ్ కుమార్ దే పై చెయ్యి….

uttam kumar news

ముందస్తు ఎన్నికల నోటిఫికేషన్ కు టైం ఎంతో లేదు. దీంతో ఇప్పుడిప్పుడే కూటమి తన అభ్యర్థుల లిస్టు ఫైనల్ చేసే పనిలో పడింది.  కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసిన అభ్యర్థుల జాబితాలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వర్గానిదే పై చేయిగా కన్పిస్తోంది. రేవంత్ రెడ్డి వర్గానికి షాక్ ఇచ్చినట్టు కన్పిస్తోంది. పార్టీ నేతలు  అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొంత అసహనానికి గురై ఒకానొక దశలో తాను పోటీకి కూడ దూరంగా ఉంటానని ప్రకటించినట్టు ప్రచారంలో ఉంది.

కాంగ్రెస్ ‌పార్టీ ఎన్నికల కమిటీ 74 మంది అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసింది. వాస్తవానికి నవంబర్ 10వ తేదీన  కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను ప్రకటించాలని భావించింది. కానీ భాగస్వామ్య పార్టీలతో సీట్ల సర్దుబాటు విషయం ఫైనల్ కాకపోవడం, ఫైనలైనట్టుగా చెబుతున్న జాబితాపై  కాంగ్రెస్‌ నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకిరేకల్ స్థానాన్ని కాంగ్రెస్‌కు కాకుండా తెలంగాణ ఇంటి పార్టీకి కేటాయించినట్టు ప్రచారం జరగడంతో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  సీరియస్ కామెంట్స్ చేశారు. నకిరేకల్ సీటు చిరుమర్తి లింగయ్యకు కేటాయించకపోతే తాను కూడ పోటీకి దూరంగా ఉంటానని సంచలన ప్రకటన చేశారు.

మరోవైపు  ఈ ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా శుక్రవారం సాయంత్రం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఫోన్ చేశారు. నకిరేకల్ సీటును  తెలంగాణ ఇంటి పార్టీకి కేటాయించలేదని స్పష్టం చేశారు. నకిరేకల్ నుండి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోందని కుంతియా కోమటిరెడ్డికి హామీ ఇచ్చారు.ప్రజా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు టీజేఎస్,  సీపీఐలు కూడ కాంగ్రెస్‌ తీరుపై ఆందోళనగా ఉన్నాయి. టీజేఎస్‌కు 8 సీట్లు ఇస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. కానీ, జాబితా విషయంలో కొంత టీజేఎస్ అసంతృప్తితో ఉంది. తమకు కేటాయించే స్థానాల విషయంలో  కాంగ్రెస్ తీరుపై సీపీఐ అసహనంతో ఉంది. కనీసం 5 స్థానాలు తమకు ఇవ్వాలని సీపీఐ డిమాండ్ చేస్తోంది.

తాము పోటీ చేసే స్థానాల జాబితాను సీపీఐ  శుక్రవారం నాడు ప్రకటించింది. శనివారం సాయంత్రం కూటమి విషయమై సీపీఐ కీలక ప్రకటన చేసే అవకాశం లేకపోలేదు. మరో వైపు రేవంత్ రెడ్డి కూడ కాంగ్రెస్ జాబితాపై  సంతోషంగా లేరు. తాను టీడీపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో తనకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అమలు చేయడం లేదని రేవంత్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు.తనతో పాటు టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన అరికెల నర్సారెడ్డి, వేం నరేందర్ రెడ్డి, బిల్యానాయక్, హరిప్రియానాయక్, రాజారామ్ యాదవ్ లాంి నేతలకు  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇంకా టికెట్లను ఫైనల్ చేయలేదు.

కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసిన 74 మంది జాబితాలో ఎక్కువగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి వర్గీయులే ఎక్కువగా ఉన్నారని  సమాచారం. అయితే తనతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన 19 నుండి 20 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇంకా ఫైనల్ చేయకపోవడంపై రేవంత్ గుర్రుగా ఉన్నారు.

ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించే స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో  ఈ 20 మందికి టికెట్ల కేటాయింపు విషయమై కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.  అయితే ఈ ప్రచారాన్ని రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు.

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన ముందున్న లక్ష్యంగా  రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీ నేత పొన్నాల లక్ష్మయ్య కు సీటు రాకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహత్మకంగా ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారంపై  పొన్నాల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

జనగామ నుండి టీజేఎస్ చీఫ్  కోదండరామ్ పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. జనగామ టికెట్టును టీజేఎస్‌కు కేటాయించారనే ప్రచారంపై పొన్నాల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే  బీసీల నుండి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తోందని పొన్నాల అభిప్రాయపడ్డారు.మరోవైపు మల్కాజిగిరి సీటును టీజేఎస్‌‌కు కేటాయించినట్టు వార్తలు రావడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీధర్‌ వర్గీయులు గాంధీ భవన్ ఎదుట ఆందోళనకు దిగారు.

ఖానాపూర్ సీటును  హరినాయక్‌కే కేటాయించాలని రమేష్ రాథోడ్‌కు టికెట్టు వద్దంటూ  హరినాయక్ వర్గీయులు రెండు రోజులుగా గాంధీ భవన్ ఎదుట దీక్ష చేపట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను  ప్రకటిస్తే మరిన్ని ఆందోళనలు చోటు చేసుకొనే అవకాశాలు లేకపోలేదని రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు.

uttam kumar news,congress party latest news,uttam kumar reddy latest news,congress party new list ,uttam kumar reddy is in first place

 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *