టీడీపీ కోసం సీటు త్యాగం చేసిన ఉత్తమ్ భార్య

Uttam Kumar Reddy

కాంగ్రెస్ పార్టీలోని పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మా రెడ్డి మహాకూటమి పొత్తులలో తన సీటు త్యాగం చేశారు. అవును ఆమె తన సిట్టింగ్ స్థానాన్ని టీడీపీ కోసం త్యాగం చేస్తున్నారని సమాచారం. కూటమి పొత్తులలో భాగంగా టీడీపీ కి ఇస్తున్న సీట్లలో ఒకటైన కోదాడ గత ఎన్నికల్లో కాంగ్రెస్ హస్తగతం చేసుకున్న స్థానం. అక్కడ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మా రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. కానీ ఈ ఎన్నికల్లో అనూహ్యంగా ఆ స్థానాన్ని ఆమె మిత్ర ధర్మం కోసం వదులుకోబోతున్నారు.
నిన్నా మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీలో రెండు టికెట్లు ఆశించిన వారు కుటుంబానికి ఒక టికెట్ అవకాశం ఇస్తామని, గతంలో గెలిచిన సిట్టింగ్ స్థానాలకు మినహాయింపు అని చెప్పటంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మా రెడ్డి కి టికెట్ ఇవ్వనున్నారని తాము అడిగితే కుటుంబానికి ఒక్కటే సీటని నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారని తెగ ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆమె కూడా పోటీ కి దిగటం లేదు. కోదాడ నుండి గత ఎన్నికల్లో గెలిచిన సిట్టింగ్ స్థానం కాబట్టి పద్మా రెడ్డి కి తిరిగి అవకాశం ఇస్తారని అంతా భావించారు. కానీ కూటమి పొత్తుల సర్దుబాటులో ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య టీడీపీ కోసం ఆ స్థానం వదులుకున్నారు.
ఇక టీడీపీ కి ఇచ్చే స్థానాలు చూస్తే ఉప్పల్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, సత్తుపల్లి, ఖమ్మం, దేవరద్ర, మక్తల్, అశ్వారావుపేట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, కోదాడ, బాల్కొండ సీట్లను కాంగ్రెసు టీడీపికి ఇవ్వనుంది. కోదాడ సీటు టీడీపీ కి ఇచ్చి పద్మా ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ సీటును వదులుకుంటారని సమాచారం. మొత్తానికి గతంలో గెలిచినా స్థానాన్ని సైతం వదులుకుని మిత్ర ధర్మం పాటించింది కాంగ్రెస్. అంతే సర్దుబాటుతో కలిసి సాగనుంది టీడీపీ.
పొత్తులతో ఎన్నికలకు వెళ్తున్న కూటమిలో తెలుగుదేశం పార్టీకి 14 సీట్లు ఇవ్వడానికి సిద్ధపడిన కాంగ్రెస్ టీడీపీ బలంగా ఉన్న స్థానాల్లో పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అలాగే గతంలో కాంగ్రెస్ గెలుచుకున్న కోదాడ కూడా ఆ లిస్ట్ లో ఉండటంతో ఆమె కూడా పోటీ నుండి తప్పుకున్నారని తెలుస్తుంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్, జడ్చర్ల సీట్లలో తమ అభ్యర్థులను పోటీకి దించి ఇబ్రాహింపట్నం,అలాగే మక్తల్, దేవరకద్ర సీట్లను టీడీపికి కాంగ్రెసు కేటాయించింది. మొత్తానికి కాంగ్రెస్ లోనూ త్యాగ మూర్తులు ఉన్నారని టీడీపీ లిస్టు చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.

Uttam Kumar Reddy, Uttam Kumar Reddy’s wife Padma Reddy Latest News On TDP  , Kodhada Election news, Congress latest News, Telangana Political News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *