వేణుమాధవ్ నామినేషన్ తిరస్కరణ

Actor Venu Madhav Nomination was Rejected

  • అవసరమైన అన్ని పత్రాలూ లేవన్న అధికారులు
  • మళ్లీ సోమవారం వస్తానన్న హాస్యనటుడు

హాస్య నటుడు వేణుమాధవ్ వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన.. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నల్లగొండ జిల్లా కోదాడ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాలని భావించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కోదాడ రిటర్నింగ్ అధికారానికి వచ్చి నామినేషన్ పత్రాలు సమర్పించారు.




అయితే, అవసరమైన అన్ని పత్రాలు లేనందను అధికారులు ఆయన నామినేషన్ ను తిరస్కరించారు. దీంతో అన్ని రకాల పత్రాలను తీసుకుని మరోసారి వస్తానని వేణుమాధవ్ తెలిపారు. నామినేషన్ల గడువుకు చివరి రోజైన సోమవారం వచ్చి నామినేషన్ దాఖలు చేస్తానని వెల్లడించారు. వేణుమాధవ్‌ స్వస్థలం కోదాడ పట్టణం. ఇక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసి, మిమిక్రి ఆర్టిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించారు.

అనంతరం టీడీపీ ఆవిర్భావం  తర్వాత ఆ పార్టీ సభలో పాల్గొని తన మిమిక్రి ద్వారా ప్రచాన కార్యక్రమాన్ని చేట్టారు. అనంతరం సినిమాల్లో అవకాశాలు రావడంతో హాస్యనటుడిగా వందలాది చిత్రాల్లో నటించారు. వేణుమాధవ్ కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం కలిగిందే. ఆయన మిత్రబృందం కూడా రాజకీయాల్లో ఉండటంతో నియోజకవర్గ ప్రజలకు తన వంతు సేవాకార్యక్రమాలను చేపట్టేందుకు క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు.

Subscribe To TS NEWS CHANNEL 

TSNEW Subscribe For More Entertainment News
Subscribe to Real Estate Guru  For More property News and Updates
 




YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *