ధర్నాచౌక్ లో మొదటి ధర్నా మాదే తొలి సంతకం దీని మీదే అన్న వీహెచ్

Congress leader VH. Hanumantha Rao Latest news

గతంలో ఏ ధర్నాకి అయినా ఇందిరా పార్కు వద్ద ధర్నాచౌక్ వేదికగా ఉండేది.కొన్నాళ్ల క్రితం టీఆర్ఎస్ సర్కార్ నగరం మధ్యలో ఉన్న ధర్నాచౌక్ వల్ల స్థానికుల రాకపోకలకు, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని దాన్ని ఎత్తేసింది. ఆందోళనకారులు ఊరి బయట ధర్నాలు చేసుకోవాలని సూచించింది. దీనిపై కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు కోర్టుకెక్కారు.పిటిషన్లపై చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.ఎత్తివేతపై ఏడాదిగా ప్రభుత్వం వివరణ ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు ఉందంటూ ధర్నా చౌక్‌ ఎత్తివేత నిర్ణయాన్ని రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
టీఆర్ఎస్ సర్కార్ నిర్ణయంపై పోరాడి విజయం సాధించిన వీహెచ్‌ తొలిసారిగా ధర్నాచౌక్‌ వద్ద ధర్నా నిర్వహించారు.రాఫెల్‌ వ్యవహారంలో పారదర్శకత లోపించిందని ఆరోపిస్తూ మహా కూటమి నేతలు వీహెచ్‌ నేతృత్వంలో నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా వీహెచ్‌ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే తొలి సంతకం ధర్నాచౌక్‌ను శాశ్వతంగా తెరిపించే అంశంపైనే చేస్తామని హామీ ఇచ్చారు.అప్పుడు అందరూ ధర్నాచౌక్‌లో సమావేశాలు పెట్టుకొనేందుకు వీలుంటుందన్నారు. తమ నిరసన గళం విన్పించేందుకు వీలుగా ధర్నాచౌక్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చిన న్యాయవ్యవస్థకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో నాలుగన్నరేళ్ల పాటు సాగిన నియంతృత్వ పాలనకు రానున్న ఎన్నికల్లో మహాకూటమి చరమగీతం పాడుతుందన్నారు.

Congress leader VH. Hanumantha Rao Latest news , Congress Latest news ,VH. Hanumantha Rao Court news, TRS Party news, Mahakutami update news.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *