ఓవ‌ర్ టు ప‌లాస

Victims from Titli Toofan

– నేడు ప‌రిహారం పంపిణీ
సర్వం కోల్పోయిన వారికో భ‌రోసా
నీడ కోల్పోయిన వారికో అండ
పంట కోల్పోయిన వారికో ఆస‌రా
ఏమీ లేనివారికో ఆద‌రువు
ఇలా సీఎం త‌న త‌ర‌ఫున తీసుకోవాల్సిన
చ‌ర్య‌ల‌న్నీ ముమ్మ‌రం చేశారు.
కేంద్రం ఇచ్చిన అరకొర నిధులు ఏ మేర‌కు
అక్క‌ర‌కు రాకున్నా అవేవీ ప‌ట్టించుకోక‌
బాధితుల‌కు 520 కోట్ల రూపాయ‌ల మేర‌కు అందించేందుకు
ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశారు. బ్యాంక‌ర్లు మొండికేసినా, అధికారులు చేతివాటం చూపినా
స‌హించేది లేద‌ని చెబుతున్నారు. మంత్రి అచ్చెన్న‌, మ‌రో మంత్రి క‌ళా, ఎంపీ రామూ
తీసుకున్న చొర‌వ ఫ‌లితంగా బాధిత గ్రామాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి.

తిత్లీ తుఫాను నుంచి బాధితులు కోలుకునేలా ప్ర‌భుత్వం త‌న వంతు సాయం అందించేందుకు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేసింది. మంత్రి అచ్చెన్న‌తో స‌హా ఇత‌ర మంత్రులంతా బాధిత ప్రాంతాల్లో మ‌కాం వేసి మరీ స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మురం చేసిన వైనాన్ని ప్ర‌జానీకం గుర్తు చేసుకుంటూనే ప‌రిహారం పంపిణీలో జ‌న్మ‌భూమి క‌మిటీ జోక్యం ఉండ‌రాద‌ని కోరుకుంటోంది. నాలుగు ల‌క్ష‌ల మందికి పైగా అందే ఈ సాయం కోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నారు. ఇప్ప‌టికే శ్రీ‌కాకుళంలో రెండు ఇంజినీరింగ్, మ‌రో డిగ్రీ క‌ళాశాలలో న‌ష్టాల‌కు సంబంధించిన వివ‌రాలను కంప్యూట‌రీక‌రించారు. ఇందులో రాజ‌కీయ ఒత్తిళ్లు ఉన్నాయ‌ని, క‌నుక కొన్ని త‌ప్పిదాలు దొర్లాయని గుర్తించిన క‌లెక్ట‌ర్ వెంట‌నే వాటిని స‌వ‌రించారు. కేంద్రం నుంచి పెద్ద‌గా ఆర్థిక చేయూత ద‌క్క‌కున్నా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం మూడు వారాల్లోనే ప‌రిహారం అందించేందుకు చేసిన కృషి స‌ర్వ‌త్రా అభినంద‌న‌లు అందుకుంటోంది. జిల్లా ఏపీ ఎన్జీఓ సంఘం కూడా ఆయ‌న ప్ర‌య‌త్నాన్ని అభినందిస్తోంది. ముఖ్య‌మంత్రి త‌దేక దీక్ష‌తో రెండు తుఫానులు సృష్టించిన విల‌యాన్ని అధిగ‌మించ‌గ‌లిగార‌ని, హుద్ హుద్ విష‌య‌మై కానీ, తిత్లీ విష‌య‌మై కానీ ఆయ‌న తీసుకున్న చొరవ ఎంతైనా అభినంద‌నీయ‌మ‌ని ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్య‌క్షులు హ‌నుమంతు సాయిరాం కొనియాడారు.

వ్య‌వ‌సాయ సంబంధిత న‌ష్టాల అంచ‌నాల్లో 385 బృందాలు, ఉద్యాన వ‌న శాఖ‌కు సంబంధించిన న‌ష్టం అంచ‌నాల్లో 157 బృందాలు రేయ‌న‌క, ప‌గ‌ల‌నక ప‌నిచేశాయి. బాధిత గ్రామాల‌కు రెండు పూట‌లా భోజ‌నాలు ఏర్పాటుచేసిన దాఖ‌లాలూ ఉన్నాయి.రియ‌ల్ టైం గ‌వ‌ర్నెన్స్ ద్వారా
ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు విని వాటి పరిష్కారానికి కృషి చేసిన సంద‌ర్భాలూ ఉన్నాయి. ముఖ్యంగా క‌లెక్ట‌ర్ ధ‌నంజయ‌రెడ్డి చొర‌వ ఫ‌లించి న‌ష్టాల న‌మోదులో చోటుచేసుకున్న అక్ర‌మాల‌లో కొన్నింటికి అడ్డుక‌ట్ట వేయ‌గ‌లిగారు. అధికారుల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టించ‌డంలో సీఎంతో పాటుగా తానూ ప‌నిచేసి భేష్ అనిపించుకున్నారు.విద్యుత్ పున‌రుద్ధ‌ర‌ణ‌కు సంబంధించి కొత్త లైన్లు వేసి , ఎనిమిదివేల మందికి పైగా సిబ్బంది చెమ‌టోడ్చారు. కొన్నింట నీరు అంద‌కుంటే ఫైర్ ఇంజ‌న్ల సాయంతో ఆయా గ్రామాల‌కు సంబంధిత స‌మ‌స్య తీర్చారు. ఇవాళ చంద్ర‌బాబు
రాకుంటే నాటి ప‌రిస్థితుల్లో అనూహ్య మార్పులు రావ‌డం అసాధ్య‌మేన‌ని విన‌వ‌స్తోన్న వాద‌నకు కార‌ణం సీఎం ప‌నిత‌న‌మే!

Victims from Titli Toofan, AP Latest News on Titli Toofan, Two engineering and other degree colleges in Srikakulam ,Political news in Srikakulam , Telugu news update in AP 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *