టీడీపీని అడుగడుగునా అనుమానిస్తున్న విజయశాంతి .. అదే కారణం

VijayaShanthi News
తెలుగుదేశం పార్టీతో కాంగ్రెసు పొత్తును మొదటి నుంచి తెలంగాణా రాములమ్మ విజయశాంతి వ్యతిరేకిస్తుంది.మొదట నుండి విజయశాంతి కి టీడీపీ తో పొత్తు ఇష్టం లేదు. అయినా అధిష్టానం ఆదేశాల మేరకు రాములమ్మ సర్దుకుపోవాలనుకుంది. కానీ సర్దుకు పోలేకపోతుంది. టీడీపీ వ్యవహారంలో ఎప్పుడూ ఏదో ఒక లిటిగేషన్ పెట్టాలని చూస్తుంది. అసలే సీట్ల సర్దుబాటు తెగక, అలుగుతున్న నాయకులను బుజ్జగించలేక నానా చావు కాస్తున్న కాంగ్రెస్ కు రాములమ్మ వ్యక్తం చేసే అనుమానాలు పెద్ద తలనొప్పిగా మారాయి.
తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో కాంగ్రెసు నాయకురాలు, సినీ నటి విజయశాంతి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపితో సీట్ల సర్దుబాటు టీఆర్ఎస్ కు అనుకూలంగా జరుగుతోందనే అనుమానాలు ఆమె మాటల్లో వ్యక్తమవుతోంది. శేరి లింగం పల్లి లో తెలుగు దేశం నేతల మధ్య ఘర్షణ, మరొకపక్క గాంధీ భవన్ ముందు భిక్షపతి వర్గం ఆందోళన, ఇద్దరి ఆత్మహత్యా యత్నం వెరసి అక్కడ టికెట్ టీడీపీ కి ఇస్తే టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటుందేమో అని తన అనుమానం అని చెప్తుంది రాములమ్మ .
తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ప్రజా కూటమిలో కాంగ్రెస్‌ నాయకులకు ఆమోదయోగ్యంగా సీట్ల సర్దుబాటు ఉండాలని, ఆ సర్దుబాటు టీఆర్ఎస్ నాయకులు కోరుకునే విధంగా ఉండకూడదని అంటుంది. శేరిలింగంపల్లి సీటుపై గాంధీభవన్‌లో జరిగిన పరిణామాలు తనలో కలిగిన ఆ విధమైన అనుమానాలను బలపరుస్తున్నాయని చెప్పి అసంతృప్తి వాదులకు ఊతమిస్తుంది. మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ తన ఉనికి చాటుకోవడానికి మాత్రమే కాకుండా టీఆర్‌ఎస్‌ను ఓడించడం కూడా బాధ్యతగా భావించాలని రాములమ్మ చెప్తుంది. మొత్తానికి రాములమ్మ టీడీపీతో పొత్తు నచ్చకే సందు దొరికితే చాలు టీడీపీ ని టార్గెట్ చేస్తుంది

VijayaShanthi News, Tdp Latest News, Telugu News, Telugu Update News, Telugu News, Congress Latest News, Tdp Update News, Telangana Latest News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *