దుబ్బాక నుండి రాములమ్మ పోటీ

vijayshanthi latest news

కాంగ్రెస్ పార్టీ  స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి మొదట ఎన్నికల్లో పోటీ చెయ్యరని భావించారు. కానీ ఇప్పుడు రాములమ్మ పోటీ చెయ్యాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే స్థానం మార్చుకుని ఎన్నికల బరిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యారని తెలుస్తుంది.

గతంలో టీఆర్ఎస్  తరఫున మెదక్ స్థానానికి ఎంపీ గా పోటీ చేసి నెగ్గిన సినీ నటి విజయశాంతి ఎంపీగా ప్రజా క్షేత్రంలో మమేకమై పని చేశారు. అయితే  తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాటకు కట్టుబడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అందుకు అప్పుడు ఉన్న కారు గాలే కారణం. ఆ తర్వాత  చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు విజయశాంతి. అయితే మళ్లీ కాంగ్రెస్ నాయకత్వం ఆమెను పోటీ చేయమని కోరడంతో ఈ సారి ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతానని తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఆ తరువాత ఆమెలో పోటీ చేయాలన్న సంకల్పం బలపడటం తో ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దుబ్బాక నుండి పోటీ చేయాలనీ ఆమె డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.

గతంలో మెదక్ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసి పద్మాదేవేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలైన ఆమె ఈసారి సీనియర్ నాయకుల సూచనలతో  స్థానం మార్చుకున్నారు. సినీ గ్లామర్ కి తోడుగా గతంలో ఎంపీగా పనిచేసి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అనుభవం కూడా  ఇపుడు ఎమ్మెల్యేగా తన గెలుపుకు సాయపడుతుంది ఆమె భావిస్తున్నారు. మెదక్ నుండి ఇదే కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిన రాములమ్మ, ఈ సారి దుబ్బాక నుండి పోటీ కి సై అంటున్నారు. మరి దుబ్బాక నుండి విజయ శాంతి ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారో లేదో వేచి చూడాలి.

vijayshanthi latest news,vijayshanthi contesting mla from dhubbaka constituency,congress leader vijayshanthi latest news,

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *