వినోద్ ఇంతకీ ఏ పార్టీ ఆఫర్ ఓకే చేస్తాడు?

TRS Party Update News

టీఆర్ఎస్ పార్టీ నాయకుడు వినోద్ కు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. పార్టీ మారాలని ఢిల్లీ చేరిన వినోద్ కు కేటీఆర్ ఎమ్మెల్సీ ఇస్తామని అక్కడ ఆయనకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. వివేక్ కూడా వస్తే బాగుంటుందని తనని తీసుకురావాలని కోరుకున్న టికెట్ ఇస్తామనికాంగ్రెస్ అధిష్టానం చెప్పటంతో డైలమాలో పడ్డారు విండో. ఇక కేతీఆర్ వెనక్కు రండి ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పటం తో వినోద్ ఏం చేస్తాడో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీఆర్ఎస్‌లో అసమ్మతి రాగాలు ఆగటం లేదు. పార్టీ మారేందుకు కూడా సిద్ధం అవుతున్నారు నేతలు. చెన్నూరు నుంచి టికెట్ ఆశించి భంగపడి తీవ్ర మనస్తాపానికి గురైన మాజీ మంత్రి, సీనియర్ నేత జి. వినోద్‌ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు.రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన వినోద్ కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. చెన్నూర్ నుంచి రాకపోతే బెల్లంపల్లైనా తనకు ఓకేనని ఆయన సంకేతాలు ఇచ్చారు. అయితే సోదరుడు వివేక్‌తో కలిసి వస్తేనే పార్టీలో చేర్చుకుంటామని కాంగ్రెస్ అధిష్టానం చెప్పడంతో… ఆయన డైలమాలో పడ్డారు.. అయినప్పటికీ తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.
అయితే ఆయన్ను బుజ్జించేందుకు మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. ప్రస్తుతానికి పట్టువీడాలని.. పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆయన వినోద్ ముందు ప్రతిపాదన ఉంచినట్లుగా టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక కేటీఆర్‌‌తో ఆయన చర్చలు జరిపే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఎవరిది బెస్ట్ ఆఫర్ అయితే వినోద్ ఆ పార్టీలో ఉండే అవకాశం వుంది.

TRS Party Update News,Vinodh which party , Vinodh Political News, Delhi News, TRS Party Leader Latest News, Telugu News, Telugu Update News, KTR Update News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *