భూమి చుట్టూ రాజ‌కీయం

Vishakhapatnam News

మ‌న నాయ‌కుల‌కు దేశ‌భ‌క్తి ఎక్కువే అని అనుకోవాలి
లేదా దేశం పేరిట చాటుకున్న భ‌క్తి ఓ క‌పటం అని తెల్సుకోవాలి
అధికారంలో ఉన్నంత కాలం త‌మ శ‌క్తి మేర క‌బ్జాలు చేసిన నాయ‌కులు
ఇప్పుడు ద‌ర్యాప్తు బృందాల‌ను అనుమానిస్తూ.. అస‌లు తామేమీ త‌ప్పే
చేయ‌లేద‌ని చెబుతున్నారు. ఈ క‌థ‌లో వంద మంది అధికారులు.
350 మందికి పైగా ప్రైవేటు వ్య‌క్తులు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.
అయినా విశాఖ భూ కుంభ‌కోణంలో కొంద‌రు మంత్రుల‌కు సిట్ క్లీన్ చిట్ ఇచ్చేసింది
ఇంకొంద‌రిని అన‌గా ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను నిందితులుగా పేర్కొంటుంది.
ఇది అస‌మ‌గ్ర ద‌ర్యాప్తునకు సంకేతం అన్న‌ది ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ
ఏదేమైనా రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో జ‌రిగిన నాటి తంతుకు నేటి కొన‌సాగింపు
కొంద‌రికి కంట‌కంగా ఉన్నా నిజానిజాలే ఇంకా వెల్ల‌డి కాక‌పోవ‌డం అప్ప‌టి క‌థలో
ఏయే మ‌త‌ల‌బులున్నాయే తేల‌క‌పోవ‌డం ఒకింత ఆశ్చ‌ర్య‌క‌రం.

ఓ మాజీ మంత్రి భూ కుంభ‌కోణంలో ప్ర‌ధాన పాత్ర‌ధారి అని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.కానీ ఆయ‌నేమో సిట్ ద‌ర్యాప్తు స‌రిగా లేద‌ని అంటున్నారు.మ‌రి వాస్త‌వాలేవైనా వెల్ల‌డి చేశారా అంటే అదీ లేదు. సందిగ్ధావ‌స్థ‌లో ఈ వ్య‌వ‌హారంపై ఇంకా నీలి నీడ‌లు ప్ర‌స‌రిస్తూనే ఉన్నాయి. ఈ త‌రుణాన మా మాజీ మంత్రితో స‌హా మ‌రికొంద‌రు ఐఏఎస్ స్థాయి అధికారులు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. కానీ ధ‌ర్మాన మాత్రం త‌న త‌ప్పేమీ లేద‌న్న ధోర‌ణిలోనే మాటలు చెబుతున్నారు. విచార‌ణ బృందాల‌ను తాను అనుమానించాల్సి వ‌స్తుంద‌ని అంటున్నారు.

Vishakhapatnam News , Vishakhapatnam Latest News, Ex Minister major player in the land scam , Land scam Latest News , Telugu news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *