కూటమిలోనూ కొట్లాట

War in Telangana Mahakutami

· ఒకే స్థానంలో తమ అభ్యర్థులను ప్రకటించిన కూటమి పార్టీలు

· ఐదు స్థానాల్లో అనివార్యం కానున్న స్నేహపూర్వక పోటీ

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని గద్దె దించే లక్ష్యంతో ఏర్పాటైన కూటమిలో లుకలుకలు ఇంకా తగ్గలేదు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు వరకు టికెట్ల కేటాయింపు, సీట్ల సర్దుబాటు, ఎడతెగని చర్చలతో కాలం గడిపిన కూటమి పార్టీల్లో కొన్ని సీట్లకు సంబంధించి ఏకాభిప్రాయం రాలేదు. దీంతో ఆయా చోట్ల కూటమి పార్టీల మధ్య కూడా పోరు తప్పని పరిస్థితి నెలకొంది. రెండు నెలలుగా లెక్కకు మిక్కిలి సార్లు సమావేశాలు, చర్చలు, సంప్రదింపులు జరిగినప్పటికీ.. సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తుండటంతో తాము కోరుకున్న స్థానాలకు కూటమి పార్టీలు బీ ఫారాలు ఇచ్చేశాయి. దీంతో కూటమిలోనూ కొన్నిచోట్ల స్నేహపూర్వక పోటీ తప్పని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మిర్యాలగూడ, వరంగల్ ఈస్ట్, దుబ్బాకల్లో కాంగ్రెస్, తెలంగాణ జనసమితిలు తమ తమ అభ్యర్థులను బరిలోకి దించి, వారికి బీ ఫారాలు ఇచ్చేశాయి. అలాగే ఇబ్రహీంపట్నం స్థానాన్ని తొలుత టీడీపీకి కేటాయించిన కాంగ్రెస్.. తాజాగా అక్కడ తన అభ్యర్థిగా మల్ రెడ్డి రంగారెడ్డిని బరిలోకి దించింది. మరోవైపు మహబూబ్ నగర్ స్థానం నుంచి టీడీపీ, టీజేఎస్ లు రెండూ పోటీ చేస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు 22 వరకు గడువు ఉన్న నేపథ్యంలో ఆలోగా వీరిలో ఎవరైనా తమ నామినేషన్లు ఉపసంహరించుకోని పక్షంలో కూటమి పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ అనివార్యమే. ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించిన స్థానాలను పరిశీలిస్తే.. మూడు చోట్ల కాంగ్రెస్, టీజేఎస్ మధ్య, ఒక స్థానంలో టీడీపీ, టీజేఎస్ మధ్య, ఒక స్థానంలో కాంగ్రెస్, టీడీపీ మధ్య పోటీ ఖాయంగా కనిపిస్తోంది

War in Telangana Mahakutami , Mahakutami latest news, Telangana political news, telugu news, TRS party news, Congress latest news.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *