వరంగల్ తూర్పు రాజకీయ ముఖ చిత్రం

 ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత వుంది. రాజకీయ ప్రాధాన్యత కూడా వుంది. తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా పేరొందింది. అయితే గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి టఆర్ఎస్ విజయం సాధించింది. ఈ నియోజకవర్గంలో 14 సార్లు ఎన్నికలు జరగ్గా, 8సార్లు కాంగ్రెస్ అభ్యర్ధులే విజయం సాధించారు. మూడు సార్లు టీడీపీ, రెండుసార్లు స్వతంత్య్ర అభ్యర్ధులు విజయం దక్కించుకున్నారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా టీఆర్‌ఎస్ విజయ ఢంకా మోగించింది. ఇప్పటి వరకు వరంగల్  తూర్పు రాజకీయ ముఖ చిత్రం పై టీఎస్ న్యూస్ అందించే కథనం

నియోజకర్గంలో తొలిసారి 1952లో ఎన్నికలు జరగ్గా కాగ్రెస్ అభ్యర్ధి ఎంఎస్ రాజలింగం గెలుపొందాడు. 1957లో కూడా కాంగ్రెస్ అభ్యర్ధి మీర్జ ఉమర్‌బేగ్ విజయం దక్కించుకున్నారు. 1962లో స్వత్యంత్ర అభ్యర్ధి నాగభూషణం రావు విజయం సాధించారు. 1967లో కూడా స్వతంత్య్ర అభ్యర్ధి టీఎస్ మూర్తి గెలుపొందారు. 1972లో కాంగ్రెస్ అభ్యర్ధి పి.ఉమారెడ్డి, 1978లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటి చేసిన ఆరెల్లి బుచ్చయ్య విజయం దక్కించుకున్నారు. ఇక 1983,1985 రెండు ఎన్నికల్లో కూడా అప్పటి టీడీపీ అభ్యర్ధి బండారి నాగభూషణం రావు విజయఢంకా మోగించారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్ధి టీ. పురుషోత్తం రావు, 1994లో టీడీపీ అభ్యర్ధి దోనెపూడి రమేష్‌బాబు గెలిచారు. 1999, 2004,2009 వరసగా మూడు సార్లు కాంగ్రెస్ అభ్యర్ధి బస్వారాజు సారయ్య హైట్రిక్ విజయం దక్కించుకున్నారు. కాగా 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్ధిగా కొండా సురేఖ విజయం దక్కించుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ తూర్పు సెగ్మెంట్ అత్యంత కీలకంగా మారింది.

దీంతో ఇక్కడ అభ్యర్ధుల ఎంపిక అన్నిపార్టీలకు కత్తిమీద సాములా మారుతోంది. ప్రతీ ఎన్నికల్లో ఒక్కో పార్టీ నుంచి ఇద్దరి నుండి ఆర డజన్‌కు పైగా అభ్యర్ధులు పోటీ పడటం సర్వసాధారణంగా మారింది. దీంతో చివరి వరకు కూడా అభ్యర్ధుల ఎంపికపై ఉత్కంఠ ఏర్పడుతోంది. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 1994లో టీడీపీ, జనతాదళ్ పొత్తు పెట్టుకోగా జనతాదళ్ నుండి మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు పేరు ఖరారైంది. ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఆఖరి నిముషంలో టీడీపీ అభ్యర్థి దొనేపుడి రమేష్ బాబు పేరును ఖరారు చేసి బీఫారం ఇచ్చారు.

          అలాగే 1999లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం బస్వరాజు సారయ్య, గుండా ప్రకాశ్‌రావు హోరా హోరీగా తలపడ్డారు. చివరి నిమిషంలో సారయ్య పేరు ఖరారైంది. 2004లో టీడీపీ అభ్యర్థిత్వం కోసం దోనెపూడి రమేష్ బాబు, మూగ రాంమోహాన్, గుండు సుధారాణి, డాక్టర్ పోలా నటరాజ్ తీవ్రంగా పోటీ పడ్డారు. చివరికి సుధారాణి అభ్యర్ధిత్వాన్ని వెల్లడించారు. ఇక 2009 ఎన్నికల విషయానికొస్తే టీడీపీ, టీఆర్‌ఎస్, సీపీఐ మహా కూటమిగా ఏర్పడ్డాయి. దీంతో ఈ మూడు పార్టీల నేతలు టిక్కెట్లు ఆశించారు. చివరకు విద్యసాగర్ పేరు ఖరారైంది. 2014లో టీడీపీ, బీజేపి పొత్తు పెట్టుకున్నాయి. అయితే అప్పుడు టీఆర్ఎస్ విజయం సాధించింది. రాబోయే ఎన్నికల్లోనూ అభ్యర్థుల విషయంలో ఇటువంటి సమస్యే ఎదురుకానున్నదని తెలుస్తోంది. 

warangal district latest news,warangal district east constituency latest news,warangal district east constituency update news,

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *