వాట్సాప్ లో సరికొత్త ఫీచర్

Whatsapp Online Notifications

  • ఆన్ లైన్ ఇమేజ్ స్టయిల్ లో నోటిఫికేషన్లు
  • ఆండ్రాయిడ్ 9 పై ఫోన్లలో అందుబాటులోకి

సోషల్ మీడియాలో వాట్సాప్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వినియోగిస్తున్న ఈ సోషల్ మీడియా యాప్.. ఎప్పడికప్పుడు సరికొత్త ఫీచర్లతో అలరిస్తూనే ఉంది. తాజాగా  వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్‌ రాబోతోంది. ఇకపై నోటిఫికేషన్లు ఆన్ లైన్ ఇమేజ్ స్టయిల్ లో అలరించబోతున్నాయి. అంటే వాట్సాప్‌కు మెసేజ్‌ వచ్చినట్టు నోటిఫికేషన్‌లో ఇమేజ్‌ ద్వారా నోటిఫై చేస్తుంది. అంతకుముందు కూడా వాట్సాప్‌ నోటిఫికేషన్‌లో ఇన్‌లైన్‌ ఇమేజెస్‌ను వాడింది. కానీ తాజాగా కొత్త మెసేజింగ్‌ స్టయిల్‌ నోటిఫికేషన్‌ ఫార్మాట్‌లో దీన్ని తీసుకొస్తోంది. వాట్సాప్‌ ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బీటా ఛానల్‌లో పరీక్షించింది. అయితే ఈ ఫీచర్‌ కేవలం ఆండ్రాయిడ్‌ 9 పై డివైజ్‌లకు మాత్రమే పనిచేయనుంది. నోటిఫికేషన్‌ల కోసం తీసుకొస్తున్న ఈ ఫీచర్‌ జీఐఎఫ్‌లకు, వీడియోలకు పనిచేయదు. కేవలం చిన్న ఐకాన్‌ మాత్రమే ఇమేజ్‌ రూపంలో వస్తుంది. కేవలం ఆండ్రాయిడ్‌ లేటేస్ట్ ఫోన్లలో మాత్రమే ఈ ఫీచర్‌ పనిచేస్తుంది. పాత ఐఫోన్‌లన్నీ పాత ఆండ్రాయిడ్‌ వెర్షన్లతోనే రన్‌ అవుతున్నాయి. దీంతో వాటికి ఈ ఫీచర్‌ అందుబాటులో ఉండదు. ఓరియో వెర్షన్ల బీటాలో కూడా ఈ ఫీచర్‌ కనిపించడం లేదు. కేవలం ఆండ్రాయిడ్‌ 9 పై వారికి మాత్రమే ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది

Whatsapp Online Notifications,Whatsapp Latest Features,New Feature In Whatsapp,Get Notified When someone Comes Online,socialmedia apps latest updates,technology updates,telugu news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *