ప్రియుడి కోసం భార్య హత్య

Wife killed husband for boy friend

  • భారత సంతతి మహిళ జెస్సికా హత్య కేసులో వీడిన మిస్టరీ
  • రేపు శిక్ష ఖరారు

ఇద్దరూ ఉన్నత చదువులు చదువుకున్నారు. ప్రేమించుకుని మరీ పెళ్లి చేసుకున్నారు. లండన్ లో ఫార్మసీ నడుపుతూ చక్కగా ఉంటున్నారు. ఈ క్రమంలో అతడి బుద్ధి వక్రమార్గం పట్టింది. మరో యువకుడితి పరిచయమై అతడినే పెళ్లి చేసుకుందామనుకున్నాడు. అందుకు అడ్డుగా ఉన్న భార్యను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాకుండా ఆమె పేరిట 2 మిలియన్ పౌండ్లకు బీమా చేయించిన అనంతరం పథకం ప్రకారం హత్య చేశాడు. బీమా ద్వారా వచ్చిన సొమ్ముతో ఆస్ట్రేలియా చెక్కేసి ప్రియుడితో కాపురం పెడదామనుకున్నాడు. అయితే, పోలీసుల దర్యాప్తులో దొరికిపోవడంతో ఊచలు లెక్కపెడుతున్నాడు. భారత సంతతికి చెందిన జెస్సికా పటేల్ (34), మితేష్‌లకు మాంచెస్టర్‌ యూనివర్సిటీలో చదివే సమయంలో స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి మిడిల్స్‌బోరోలో గత మూడేళ్లుగా తమ ఇంటికి సమీపంలోనే మందుల దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది మే నెలలో జెస్సికా అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. దీంతో మితేష్‌పై అనుమానంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు తనకు ఏమీ తెలియదని బుకాయించినప్పటికీ, పోలీసులు తమదైన శైలిలో ట్రీట్ మెంట్ ఇచ్చేసరికి అన్ని విషయాలూ చెప్పేశాడు. తనకు గే డేటింగ్ యాప్ ద్వారా 2015లో సిడ్నీకి చెందిన డాక్టర్‌ అమిత్‌ పటేల్‌ అనే వ్యక్తి పరిచయం అయ్యాడని, అతడిని పెళ్లాడాలని భావించే భార్యను అంతమొందించాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించాడు. భార్యతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తూనే ఆమెను హత్య చేశాడు. అమిత్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లి, అక్కడే సెటిల్‌ కావడానికి అవసరమైన డబ్బు కోసం జెస్సికా పేరిట రెండు మిలియన్‌ పౌండ్ల జీవిత బీమా కూడా చేయించాడు. అనంతరం మే 20న జెస్సికా ఫార్మసీ నుంచి ఇంటికి రాగానే ఆమెతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఆమె చేతులు కట్టేసి, ప్లాస్టిక్‌ కవర్‌ను ముఖం చుట్టూ బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. తర్వాత దానిని దోపిడీగా చిత్రీకరించాడు. అయితే, పోలీసులు మితేష్ పై అనుమానంతో ఆ దిశగా దర్యాప్తు చేయడంలో అన్ని విషయాలూ బయటకొచ్చాయి. నేరం రుజువు కావడంతో అతడికి గురువారం శిక్ష ఖరారు చేయనున్నారు.

Wife killed husband for boy friend , London Crime news, 2 million pounds insurance , telugu news, Telugu latest news, Latest crime news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *