కట్టుకున్నోడినే కడతేర్చింది

WIFE KILLED HUSBAND IN TAMILNADU
· ప్రియుడిపై మోజుతో ఓ మహిళ ఘాతుకం
· అనంతరం ప్రియుడితో కలిసి ఉడాయింపు

భర్త విదేశంలో ఇంజనీర్.. ఆరు నెలలకోసాకి ఇంటికి వచ్చి వెళ్తుంటాడు. ఈలోగా ఖర్చులకు నెలనెలా పెద్ద మొత్తంలో డబ్బులు పంపిస్తుంటాడు. భర్త పంపే సొమ్ముతో విలసాలకు అలవాటు పడిన ఆ భార్య.. అక్కడితో ఆగకుండా ఓ కారు డ్రైవర్ తో వివాహేతర సంబంధం కూడా పెట్టుకుంది. అతడి మోజులో పూర్తిగా పడిపోయి.. కట్టుకున్న భర్తను కాటికి పంపాలని నిర్ణయించుకుంది. అనంతరం పక్కా పథకం ప్రకారం ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. కర్ణాటకలో హత్యకు ప్లాన్ వేసి.. తమిళనాడులో దాన్ని అమలు పరిచింది. తమిళనాడు తేని జిల్లా దేవదానంపట్టి సమీపంలోని కొడైకెనాల్ కొండ ప్రాంతంలో గొంతు కోసి హత్య చేసిన స్థితిలో ఉన్న ఓ యువకుడి మృతదేహాన్ని పోలీసులు ఈనెల 18న గుర్తించారు. అయితే, ఆ యువకుడి ఎవరనేది తెలియకపోవడంతో ఫొటోలు తీసిన తర్వాత పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని ఖననం చేశారు. ఈ క్రమంలో కర్ణాటకలోని మంగళూరులో ఓ యువకుడు కనిపించడంలేదంటూ ఓ మిస్సింగ్ కేసు నమోదైంది. దీంతో మంగళూరు పోలీసులు ఆ యువకుడి ఫొటోను కర్ణాటకతో పాటు పొరుగు రాష్ట్రం తమిళనాడుకు కూడా పంపించారు. దీంతో తాము ఖననం చేసి వ్యక్తి కర్ణాటకకు చెందిన మహ్మద్ సమీర్ అనే ఇంజనీర్ ది అని తమిళనాడు పోలీసులు గుర్తించి, ఆ విషయాన్ని కర్ణాటక పోలీసులకు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు భయంకరమైన వాస్తవాలు తెలిశాయి. కట్టుకున్న భార్యే అతడిని కడతేర్చిందని నిర్ధారించారు. సమీర్ కు రెండేళ్ల క్రితం ఫిర్‌దౌస్‌ అనే యువతితో వివాహమైంది. ప్రస్తుతం వారికి ఆరునెలల కుమార్తె ఉంది. అరబ్‌ దేశంలో ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్న సమీర్.. ఆరు నెలలకోసారి ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. భర్త విదేశాల్లో ఉన్నపుడు ఫిర్‌దౌస్‌కు మంగళూరుకు చెందిన కారు డ్రైవర్‌ మహ్మమద్‌ యాసిన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ప్రియునితోనే శాశ్వతంగా కాపురం చేయాలని నిర్ణయించుకున్న ఫిర్‌దౌస్‌.. భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. భారత్‌కు వచ్చిన భర్తతో కలసి ఈనెల 13న పర్యాటక ప్రాంతాల సందర్శనకు అద్దె కారులో బయలుదేరింది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం కారు డ్రైవర్‌గా తన ప్రియుడిని ఏర్పాటు చేసుకుంది. కొడైక్కెనాల్‌ వెళ్లే మార్గంలో డమ్‌డమ్‌ పారై అనే ప్రాంతంలో ఫిర్‌దౌస్, యాసిన్‌ ఇద్దరూ కలిసి సమీర్‌ గొంతుకోసి హతమార్చి శవాన్ని పడేసి వెళ్లిపోయారు. ఇంటికి చేరుకున్న తర్వాత సమీర్ గురించి అతడి తల్లిదండ్రులు ప్రశ్నించగా.. సేలంలో తన స్నేహితురాలితో వెళ్లిపోయాడని ఫిర్ దౌస్ బదులిచ్చింది. ఆమె వైఖరిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇంట్లోని బంగారు నగలు తీసుకుని పారిపోయింది. డ్రైవర్‌ యాసిన్‌ భార్య కూడా తన భర్త కనపడడం లేదని ఫిర్యాదు చేయడంతో సమీర్‌ హత్య ఉదంతం బయటపడింది.

saudi engineer killed by wife in tamilnadu 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *