ఇస్తాంబుల్లో అద్భుత విమానాశ్రయం

World`s biggest airport
అది ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయం. అద్భుతమైన కట్టడంగా టర్కీ దేశానికి మకుటాయమానం గా నిలిచినవిమానాశ్రయం ఆ విమానాశ్రయ నిర్మాణంలో వినియోగించిన అధునాతన టెక్నాలజీ , ఆర్కిటెక్చర్ నైపుణ్యం చూపరులను అబ్బురపరుస్తాయి. నల్ల సముద్ర తీరాన 7600హెక్టార్ల స్థలంలో ఇంజినీరింగ్ నైపుణ్యానికి అద్దం పడుతున్న విమానాశ్రయమే ఇస్తాంబుల్ విమానాశ్రయం. ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయం గా అద్భుత కట్టడంగా నిలిచే ఈ ఇస్తాంబుల్  విమానాశ్రయాన్ని టర్కీ దేశాధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగన్ ప్రారంభించారు. టర్కీ ఆవిర్భవించి 95సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ విమానాశ్రయం ప్రారంభించారు.

ఈ విమానాశ్రయం లో అణువణువూ అశ్చర్యాన్ని కలిగిస్తుంది. నిన్నటి వరకు అట్లాంటాలోని హార్డ్స్ ఫీల్డ్ జాక్సోన్ విమానాశ్రయం ప్రపంచంలో అతి పెద్దదిగా వుంది. ఇప్పుడు ఇస్తాంబుల్ దాని స్థానంలో పెద్ద విమానాశ్రయంగా రూపు దిద్దుకుంది. ఈ విమానాశ్రయం 6 రన్ వేలతో ఏడాదికి 200 మిలియన్ల ప్రయాణికుల కంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలకు తన సేవలందిస్తుంది.  రన్ వే మధ్యలో ఉండే ట్రాఫిక్ కంట్రోల్ చేసే లిల్లీ ( తులిప్ ) టవర్ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ అవార్డు ను అందుకుంది. లేటెస్ట్ ఎయిర్పోర్ట్ టెక్నాలజీతో , ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో సమర్ధవంతమైన శక్తి తో ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతంగా వుంటుంది. ఆసియా యూరప్ దేశాల మధ్య చాలా ప్రాధాన్యత ఉన్న హబ్ గా ఉండబోతుంది ఇస్తాంబుల్.

15 సంవత్సరాలుగా టర్కీ ప్రెసిడెంట్ గా ఉన్న  ఎర్దోగన్ 51 బిలియన్ యూరోలతో ఈ ఎయిర్ పోర్ట్  నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం టర్కీ ప్రెసిడెంట్ చాలా పోరాటం చెయ్యాల్సి వచ్చింది. ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ఎంత ప్రయాస పడ్డారంటే ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణ కార్మికులు 400 మంది మృత్యువాత పడ్డారు. వారి కుటుంబాలకు టర్కీ ప్రభుత్వం అండగా ఉన్నప్పటికీ ఇది ఈ విమానాశ్రయానికి సంబంధించిన  చీకటి కోణం. ఎంతో మంది టర్కీ లోని సాంకేతిక నిపుణులు తమ నైపుణ్యానికి మచ్చుతునకగా నిర్మించిన ఈ విమానాశ్రయం ప్రారంభమైంది. కొన్నాళ్ళ పాటు పరిమిత సంఖ్యలోనే విమానాలు నడిపిస్తారు. ఆ తర్వాత పూర్తి స్థాయి సామర్ధ్యంతో విమానాశ్రయం వినియోగంలోకి రానుంది. ప్రపంచంలోనే అతి పెద్ద , ఉన్నతమైన విమానాశ్రయం గా నిలపటమే టర్కీ ప్రభుత్వ లక్ష్యం. టర్కీ దేశ కీర్తి కి చిహ్నంగా ఉన్న విమానాశ్రయం అందులో సుందరంగా కనిపించే తులిప్ టవర్ ఇస్తాంబుల్ ఎయిర్ పోర్ట్ కు రారమ్మని ఆహ్వానిస్తాయి. పర్యాటక ప్రాంతాల సందర్శనాసక్తి ఉన్న పర్యాటకులు తప్పకుండా ఈ ఎయిర్ పోర్ట్ కి వెళ్లి రండి మరి. నల్ల సముద్రం పక్కనే ఉన్న ఈ విమానాశ్రయం ప్రపంచంలోనే ది బెస్ట్ అని మీరూ చెప్తారు.

world`s biggest airport, world`s biggest airport in Istanbul, Turkey government started world`s biggest airport in Istanbul

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *