చంద్రబాబు చొక్కా పట్టుకుని నిల‌దీయాలి

ycp mla roja news

వైసీపీ ఎమ్మెల్యే రోజా సీఎం చంద్రబాబుపై మరో సంచలన వ్యాఖ్య చేశారు. జగన్ పై జరిగిన దాడి విషయంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా అలాగే వుంది. తాజాగా కాంగ్రెస్ తో టీడీపీ పొత్తులపై చంద్రబాబు చొక్కా పట్టుకుని నిలదీయాలని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నాం అన్న విషయాన్ని మర్చిపోయి స్థాయిని మించి రోజా మాట్లాడారు. చంద్రబాబు ని టార్గెట్ చేసుకుని ఆమె మాట్లాడుతున్న తీరుకు టీడీపీ నాయకులు చిరాకు పడుతున్నారు. ఒక మహిళగా తన పరిధిలో మాట్లాడాలని సలహా ఇస్తున్నా రోజా మాత్రం మాటల దాడి ఆపటం లేదు.

జగన్ మీద జరిగిన దాడికే వైసీపీ నేతలు టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో అందరికీ తెలుసు, అయితే తాజాగా చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నాం అని చేసినటువంటి ప్రకటన తో వైసీపీ కి బలం ఇచ్చినట్టయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నారు. తెలంగాణా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు చంద్రబాబు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల తీవ్ర స్థాయి విమర్శలు చేస్తున్నారు.కాంగ్రెస్ కు వ్యతిరేఖంగా పుట్టిన పార్టీ అయిన టీడీపీని చంద్రబాబు తన స్వార్ధ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీతో కలిపారని ఆరోపిస్తున్నారు.

ఇప్పుడు తాజాగా వైసీపీ మహిళా నేత రోజా మరింత స్థాయిలో తన ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నారు.టీడీపీ మరియు కాంగ్రెస్ పార్టీలు కలవడం వెనుక బాబు యొక్క పెద్ద కుట్రే ఉందని,ఈ రెండు పార్టీలు కలవడానికి వారధిగా ఆయన కోడలు నారా బ్రాహ్మణిని ఉపయోగించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతే కాకుండా కాంగ్రెస్ మరియు టీడీపీ పొత్తు చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారన్న రోజా ఇప్పుడు టీడీపీ నేతలు చంద్రబాబు యొక్క చొక్కాని పట్టుకొని నిలదియ్యండి అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రోజా వ్యాఖ్యలపై టీడీపీ నాయకుల రివర్స్ కౌంటర్ ఏంటో మరి.

ycp mla roja news,roja sensational comments on ap cm chandrababu naidu,tdp leaders serious on ycp mla roja,ycp mla roja comments on ap cm chandrababu naidu

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *