వైసీపీలోకి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపధ్యంలో రాజకీయం వేడెక్కింది. ఇంకో వైపు జగన్ పై జరిగిన దాడి నేపధ్యంలో ప్రస్తుతం పాదయాత్ర నుండి రెస్ట్ తీసుకుంటున్న జగన్ ఇప్పుడు పార్టీ బలోపేతంపై  దృష్టి పెట్టారు. పార్టీలోని ముఖ్య నాయకులను పిలుచుకుని పరిస్థితులు తెలుసుకుంటున్నారు. అలాగే పక్క పర్తెల్లో బలమైనా నాయకుల పరిస్థితి, వారిని పార్టీలోకి తీసుకురావటానికి ఏం చెయ్యాలి వంటి వ్యూహాలు రచిస్తూ బిజీ గా ఉన్నాడు.

  ఇక అస‌లు  విషయానికొస్తే వైసీపీకి ప‌ట్టున్న జిల్లాల్లో  ఒకటైన ప్ర‌కాశం జిల్లాలో వైసీపీని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు జ‌గ‌న్ కొంద‌రు కీల‌క నేత‌ల‌ను వైసీపీలోకి  తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఈ క్ర‌మంలో కాంగ్రెస్ హ‌యాంలో ప్ర‌కాశం, నెల్లూరు, గూడురు జిల్లాల్లో చక్రం తిప్పిన బాపట్ల మాజీ ఎంపీ ప‌న‌బాక ల‌క్ష్మీ ఫ్యామిలీకి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. 1996, 1998, 2004లో నెల్లూరు నుంచి గెలుపొందిన ప‌న‌బాక‌ ల‌క్ష్మీ, 2009 బాప‌ట్ల నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన విష‌యం తెలిసిందే. ఇక‌ కేంద్రంలో జౌళి శాఖ స‌హాయ మంత్రిగా కూడా ప‌న‌బాక‌ ప‌నిచేశారు. ఇక‌, అదే ఎన్నిక‌ల్లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్రోత్సాహంతో గూడురు నుంచి ప‌న‌బాక కృష్ణ‌య్య అసెంబ్లీకి పోటీ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏపీలో  చరిష్మా లేకపోవటం తో ఇప్పుడు పనబాక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

ఇక  తాజాగా టీడీపీ-కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవ‌కాశాలు ఉండ‌డంతో ప‌న‌బాక దంప‌తులు త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు పై కార్యాచ‌ర‌ణ చేసుకుంటున్నారు. ఈ నేప‌ధ్యంలో వైసీపీ నుండి  జగన్ వారిని ఆహ్వానించారు. జగన్ నుండి పిలుపు రావ‌డంతో ప‌న‌బాక దంప‌తులు పాజిటీవ్‌గా రెస్పాండ్ అయ్యార‌ని తెలుస్తోంది. బాప‌ట్ల‌లో స‌రైన అభ్య‌ర్ధి కోసం చూస్తున్న జ‌గ‌న్.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌న‌బాక ల‌క్ష్మీని బ‌రిలోకి దించ‌నున్నార‌నే టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా జ‌గ‌న్ పాద‌య‌త్ర కంప్లీట్ అయ్యేలోకి ప‌న‌బాక దంప‌తులు వైసీపీలో చేరే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తుంది.  అలాగే ప‌న‌బాక కృష్ణయ్య‌కు నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ సీటు ఇవ్వ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఇక ప‌న‌బాక దంప‌తులు వైసీపీలోకి ఎంట్రీ ఇస్తే ప్ర‌కాశం జిల్లాలో వైసీపీకి తిరుగే ఉండ‌ద‌ని వైసీపీ శ్రేణుల్లో చ‌ర్చించుకుంటున్నారు. పక్క పార్టీల నాయకులకు జగన్ గాలం వేస్తూ అధికారం కోసం తిప్పలు పడుతున్నాడు.

ysrcp party latest news,ex ap minister panabaka lakshmi joning in ysrcp party,ys jagan invited panabaka lakshmi to join in ysrcp party

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *